Ramarao On Duty: కింగ్ ఆఫ్ క్రౌడ్ అంటూ రామారావు టైటిల్ సాంగ్!

మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’ రిలీజ్‌కు రెడీగా ఉండటంతో ప్రమోషన్స్‌తో దుమ్ములేపుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి పలు సాంగ్స్, టీజర్, ఇంటర్వ్యూలు రిలీజ్ అవ్వగా, తాజాగా ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

Ramarao On Duty: కింగ్ ఆఫ్ క్రౌడ్ అంటూ రామారావు టైటిల్ సాంగ్!

Ramarao On Duty Title Song Released

Ramarao On Duty: మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’ రిలీజ్‌కు రెడీగా ఉండటంతో ప్రమోషన్స్‌తో దుమ్ములేపుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి పలు సాంగ్స్, టీజర్, ఇంటర్వ్యూలు రిలీజ్ అవ్వగా, తాజాగా ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో రవితేజ డిప్యూటీ కలెక్టర్ అండ్ మండల్ రెవెన్యూ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Ramarao On Duty: రామారావు రెమ్యునరేషన్‌పై రవితేజ క్లారిటీ!

అయితే ఈ సినిమాలో రామారావు పాత్రను ఎలివేట్ చేస్తూ దర్శకుడు శరత్ మండవ ఈ టైటిల్ సాంగ్‌ను ఇంగ్లీష్ పదాలతో రాశారు. ఈ పాటకు సామ్ సీఎస్ అద్భుతమైన ట్యూన్ కంపోజ్ చేయగా, లవితా లోబో ఈ పాటను ఆలపించింది. ఇక ప్రజల కోసం నిత్యం పనిచేసే సిన్సియర్ ఆఫీసర్ పాత్రలో రవితేజ మనకు ఈ సినిమాలో కనిపిస్తాడని ఈ పాటలో చూపించారు. కాగా, ఈ సినిమాతో రవితేజ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే హిట్ కొట్టడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Ramarao On Duty: మాస్ రాజా కోసం మాస్ డైరెక్టర్స్..!

ఇప్పటికే ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ కాగా, ఈ సినిమాను జూలై 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యింది. ఈ సినిమాలో రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్‌లు హీరోయిలన్లుగా నటిస్తుండగా, ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాకు ప్రేక్షకులు ఎలాంటి రిజల్ట్‌ను ఇస్తారో తెలియాలంటే జూలై 29 వరకు వెయిట్ చేయాల్సిందే.