IPL 2022: ఐపీఎల్ కొత్త టీం ఓనర్లుగా రణవీర్ – దీపికాలు!!

రీసెంట్ గా మాంచెస్టర్ యునైటెడ్ ఓనర్స్ అయిన గ్లాజెర్స్ ఫ్యామిలీ ఐపీఎల్ 2022 కోసం వేలంలో పాల్గొంటున్నట్లు కన్ఫమ్ అయింది. అయితే ఈ క్యాష్ రిచ్ లీగ్ కోసం మెగా వేలానికి ....

IPL 2022: ఐపీఎల్ కొత్త టీం ఓనర్లుగా రణవీర్ – దీపికాలు!!

Ipl 2022

IPL 2022: రీసెంట్ గా మాంచెస్టర్ యునైటెడ్ ఓనర్స్ అయిన గ్లాజెర్స్ ఫ్యామిలీ ఐపీఎల్ 2022 కోసం వేలంలో పాల్గొంటున్నట్లు కన్ఫమ్ అయింది. అయితే ఈ క్యాష్ రిచ్ లీగ్ కోసం మెగా వేలానికి మరికొన్ని పెద్ద పేర్లు వినిపిస్తున్నాయి. అక్టోబర్ 25న దుబాయ్ వేదికగా జరిగే కార్యక్రమానికి బాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరుకానున్నారట.

బాలీవుడ్ స్టార్ కపుల్ రణవీర్ సింగ్, దీపికా పదుకొనెల పేర్లు కూడా వినిపిస్తుండటం గమనార్హం. రాబోయే రెండు ఐపీఎల్ టీంలలో ఒకదానిని సొంతం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. దీపికా ఎలాగూ స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన అమ్మాయే. తండ్రి మాజీ బ్యాడ్మింటన్ స్టార్ ప్రకాశ్ పదుకొనె కావడం, రణవీర్ సింగ్ ఎన్బీఏకు అంబాసిడర్ గా ఉండటం ఈ వార్తలు నిజమనిపిస్తున్నాయి.

అంతేకాకుండా రణవీర్ సింగ్ పలు ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ లలో కూడా పార్టిసిపేట్ చేస్తుంటాడు. ముందు అనుకున్నట్లు కాకుండా అక్టోబర్ 20వరకూ గడువును పొడిగించింది బీసీసీఐ.

………………………………………………..: అద్భుతమైన ఆఫర్లలో ల్యాప్‌టాప్స్.. అమెజాన్‌లో బెస్ట్ డీల్స్ ఇవే!

‘బీసీసీఐ కొత్త ఫ్రాంచైజీ ఏర్పాటు, నిర్వహణ వంటి బాధ్యతలను మరో కంపెనీకి అప్పగించాలనుకోవడం లేదు. కాకపోతే ఇండియన్లు యాజమానులైతే సమీకరణాలు మారే అవకాశం ఉంది’ అని చెప్పుకొచ్చింది. క్లోజ్‌డ్ బిడ్ కాబట్టి పారదర్శకంగా జరిగితే బాగుంటుందని ఆశిస్తున్నామని చెబుతున్నారు.

రెండు కొత్త జట్ల కోసం దీపికా- రణవీర్ లు బిడ్డింగ్ ప్రక్రియకు హాజరవుతున్నారంటే నిజంగా ఆశ్చర్యకరమే. గతంలో బాలీవుడ్ స్టార్స్ ప్రీతి జింతా, జూహీ చావ్లా, షారూక్ ఖాన్, శిల్పా శెట్టి లాంటి వాళ్లు వచ్చారు. పంజాబ్, కోల్‌కతాలకు యజమానులుగా కూడా కొనసాగుతున్నారు. అందిన సమాచారం ప్రకారం.. అహ్మదాబాద్, లక్నోల పేరిట కొత్త ఫ్రాంచైజీలు ఏర్పాటు కానున్నాయని తెలుస్తుంది.