Rashmika Mandanna : రష్మిక రోజూ ఏం తింటుందో తెలుసా?

తాజాగా రష్మిక తన యూట్యూబ్ ఛానల్ లో రోజూ ఏం తింటుందో చెప్తూ ఓ వీడియోని పోస్ట్ చేసి అందులో తన డైట్ ప్లాన్ అందరికి తెలిపింది. షూటింగ్ లో ఉన్నప్పుడు...................

Rashmika Mandanna :  రష్మిక రోజూ ఏం తింటుందో తెలుసా?

Rashmika

Rashmika Mandanna :  ఛలో సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ రష్మిక మందన్నా. ఇప్పుడు వరుస విజయాలతో దూసుకెళ్తూ నేషనల్ క్రష్ గా మారింది. ఇప్పటివరకు టాలీవుడ్ లో అలరించిన ఈ భామ త్వరలో బాలీవుడ్ లో కూడా మెరవబోతుంది. తన క్యూట్ లుక్స్ తో, స్మైల్ తో, అందంతో అందర్నీ ఫిదా చేస్తూ బోలెడంత మంది అభిమానులని సంపాదించుకుంది. రష్మిక అంత క్యూట్ గా, అంత అందంగా ఉండటానికి కారణం ఏంటో, అసలు ఏం తింటుందో అని చాలా మంది అనుకుంటారు.

 

తాజాగా రష్మిక తన యూట్యూబ్ ఛానల్ లో రోజూ ఏం తింటుందో చెప్తూ ఓ వీడియోని పోస్ట్ చేసి అందులో తన డైట్ ప్లాన్ అందరికి తెలిపింది. షూటింగ్ లో ఉన్నప్పుడు రష్మిక ఏమేమి తింటుందో, తాగుతుందో ఈ వీడియోలో చూపించింది. ఉదయాన్నే మొదట రష్మిక కోల్డ్ కాఫీ తాగింది. ఆ తర్వాత లంచ్ కి ముందు సెలరీ(ఆకుకూరల) జ్యుస్ తాగింది. మధ్యాహ్నం బాదం, వెన్న కలిపిన ఓట్స్‌ తీసుకుంది. సాయంత్రం టీ తాగింది. రాత్రికి చికెన్‌, ఉడికించిన బంగాళదుంపలను తీసుకుంది.

Vijay Babu : నాకు ముద్దు పెట్టడానికి ట్రై చేశాడు.. హీరోపై మరో నటి లైంగిక వేధింపుల ఆరోపణలు..

ఇదే షూటింగ్ లో ఉన్నప్పుడు తన మెనూ అని స్వయంగా తెలిపింది రష్మిక. మరి రష్మిక లాగ క్యూట్ గా అవ్వాలంటే మీరు కూడా ట్రై చేస్తారా ఆ మెనూని.