RC15 First Look : RC15 ఫస్ట్ లుక్ రిలీజ్.. ‘గేమ్ చెంజర్’గా చరణ్ లుక్ అదుర్స్!

రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఈరోజు RC15 టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఉదయం టైటిల్ ని అనౌన్స్ చేయగా, తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.

RC15 First Look : RC15 ఫస్ట్ లుక్ రిలీజ్.. ‘గేమ్ చెంజర్’గా చరణ్ లుక్ అదుర్స్!

RC15 Game Changer First Look released

RC15 First Look : ప్రస్తుతం ఎక్కడ చూసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు వేడుకుల హంగామానే కనిపిస్తుంది. ఆరెంజ్ మూవీని రిలీజ్ చేసి రెండు రోజులు ముందు నుంచి బర్త్ డే సెలబ్రేషన్స్ మొదలు పెట్టిన మెగా అభిమానులు.. ఆదివారం (మార్చి 26) సాయంత్రం హైదరాబాద్ శిల్పకళా వేదికలో గ్రాండ్ గా బర్త్ డే ఈవెంట్ ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగా బ్రదర్ నాగబాబు, సాయి ధరమ్ తేజ్, డైరెక్టర్స్ బాబీ అండ్ మెహర్ రమేష్, నాటు నాటు సింగర్ రాహుల్ సిప్లిగంజ్, డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ తో పాటు పలువురు ప్రముఖులు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.

RC15 Movie Title: ఎవరూ ఊహించని ‘గేమ్ చేంజర్’గా వస్తోన్న చరణ్..!

ఇక పాన్ ఇండియా వైడ్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న RC15 టైటిల్ ని బర్త్ డే కానుకగా అనౌన్స్ చేస్తామంటూ మేకర్స్ ప్రకటించగా.. ఈరోజు ఉదయం టైటిల్ ని ప్రకటిస్తూ ఒక చిన్న వీడియో గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. ‘గేమ్ చెంజర్’ (Game Changer) అనే టైటిల్ ని ఖరారు చేశారు. అలాగే ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఈరోజు మధ్యాహ్నం 3:06 గంటలకు రిలీజ్ చేస్తామంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఈ లుక్ లో చరణ్ బైక్ పై కూర్చొని స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఎక్కువ హెయిర్ తో, కళ్ళజోడు, చేతికి వాచ్, వేలుకి ఉంగరంతో స్టైలిష్ టచ్ లో మాస్ ని పరిచయం చేశాడు.

Ram Charan : రామ్‌చరణ్‌కు ఫోన్ చేసి బర్త్ డే విషెస్ చెప్పిన అమిత్ షా.. పవన్ కళ్యాణ్ లేఖ!

కాగా ఈ మూవీని తమిళ దర్శకుడు శంకర్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు. మరో తమిళ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ఈ చిత్రానికి కథని అందిస్తున్నాడు. కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్ గా నటిస్తుండగా.. అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్ జె సూర్య తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.