Realme N55 Launch : అత్యంత తక్కువ ధరకే రియల్‌మి N55 ఫోన్.. దిమ్మతిరిగే ఫీచర్లు.. ఇప్పుడే కొనేసుకోండి..!

Realme N55 Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? అత్యంత తక్కువ ధరకే రియల్‌మి కొత్త ఫోన్ వచ్చేసింది. అద్భుతమైన ఫీచర్లతో కేవలం సరసమైన ధరకే అందుబాటులో ఉంది. ఇప్పుడే కొనేసుకోండి.

Realme N55 Launch : అత్యంత తక్కువ ధరకే రియల్‌మి N55 ఫోన్.. దిమ్మతిరిగే ఫీచర్లు.. ఇప్పుడే కొనేసుకోండి..!

Realme launches an affordable 64MP camera phone in India_ check specs, price and more

Realme N55 Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి (Realme) నుంచి కొత్త ఫోన్ వచ్చేసింది. రియల్‌మి నార్జో సిరీస్‌ తర్వాత (Realme N55) పేరుతో కొత్త ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. 33W ఛార్జింగ్ సపోర్ట్, 64-MP AI కెమెరా సిస్టమ్‌ను అందించే సెగ్మెంట్‌లో ఫస్ట్ స్మార్ట్‌ఫోన్ అని కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్ రూ. 10,999తో ప్రారంభమవుతుంది. కాంటాక్టు ఆఫర్‌లో భాగంగా కంపెనీ రూ. 1000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది.

రియల్‌మి N55 రెండు వేరియంట్లలో వస్తుంది. బేస్ మోడల్ 4GB RAM, 64GB స్టోరేజీతో వచ్చింది. దీని ధర రూ.10,999. ఈ ఫోన్ టాప్-ఎండ్ వేరియంట్ 6GB RAM, 128GB స్టోరేజ్‌తో వచ్చింది. దీని ధర రూ.12,999గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 12GB వరకు డైనమిక్ RAM సపోర్టును కూడా అందిస్తుంది. ఈ ఫోన్‌లో మల్టీ టాస్కింగ్ సమస్య ఉండకపోవచ్చు. రియల్‌మి N55 ఫోన్ ప్రైమ్ బ్లూ, ప్రైమ్ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

Read Also : Xiaomi 13 Ultra Launch : ఏప్రిల్ 18న షావోమీ 13 అల్ట్రా ఫోన్ వచ్చేస్తోంది.. ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

లాంచ్ ఆఫర్‌లో భాగంగా.. Realme N55 ఫోన్ 4GB RAM మోడల్ రూ. 10,499కి అందుబాటులో ఉంది. 6GB RAM మోడల్ రూ.11,999కి అందుబాటులో ఉంటుంది. ఈ ధరలు ఏప్రిల్ 18, ఏప్రిల్ 21 మధ్య మాత్రమే వర్తిస్తాయి. ఆసక్తి గల కస్టమర్‌లు ఏప్రిల్ 18 నుంచి ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు. అదే సమయంలో (Realme N55) ఫోన్ (Amazon), Realme.comలో ఓపెన్ సేల్‌కి రానుంది. ఓపెన్ సేల్ కోసం వేచి ఉండలేని యూజర్ల కోసం ఏప్రిల్ 13న Realme అడ్వాన్స్ యాక్సెస్ సేల్ లేదా లైవ్ సేల్‌ను కూడా నిర్వహిస్తోంది.

Realme launches an affordable 64MP camera phone in India_ check specs, price and more

Realme N55 Launch : Realme launches an affordable 64MP camera phone in India 

రియల్‌మి N55 స్పెసిఫికేషన్స్ :
స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. రియల్‌మి N55 FHD+ రిజల్యూషన్, 90hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్, హోల్ పంచ్ డిజైన్‌తో 6.72-అంగుళాల ఫుల్ స్క్రీన్ డిస్‌ప్లేతో అందిస్తుంది. MediaTek Helio G88 చిప్‌సెట్ ద్వారా 6GB RAM, 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. సాఫ్ట్‌వేర్ ముందు.. ఈ ఫోన్ Android 13 ఆధారంగా రియల్‌మి UI 4.0 ఇంటర్నల్ స్టోరేజీతో రన్ అవుతుంది. కెమెరా ముందు, Realme N55 వెనుకవైపు 2MP రిజల్యూషన్‌తో B&W లెన్స్‌తో పాటు 64-MP ప్రైమరీ కెమెరాతో వస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం స్మార్ట్‌ఫోన్‌లో 8MP కెమెరా కూడా ఉంటుంది.

మంచి విషయం ఏమిటంటే.. ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. (Realme) చాలా కెమెరా ఫీచర్లను అందిస్తుంది. ఈ ఫీచర్లలో కొన్ని బోకే ఫ్లేర్ పోర్ట్రెయిట్, AI కలర్ పోర్ట్రెయిట్, స్టార్రీ మోడ్ అందిస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే.. ఈ ఫోన్ 5000mAh బ్యాటరీతో 33W SuperVOOC ఛార్జింగ్ సొల్యూషన్‌కు సపోర్టు అందిస్తుంది. 50 శాతం ఛార్జ్ చేసేందుకు కేవలం 29 నిమిషాలు పడుతుందని, 63 నిమిషాల్లో 100 శాతం మార్కును చేరుతుందని కంపెనీ పేర్కొంది.

Read Also : ChatGPT JEE Exam : చాట్‌జీపీటీ అన్ని టెస్టుల్లో పాసైంది.. కానీ, జేఈఈలో ఫెయిల్.. కేవలం 11 ప్రశ్నలకే చేతులేత్తేసింది.. ఇండియాతో అంత ఈజీ కాదు..!