Yamuna River : ఢిల్లీకి ఊరట.. హర్యానాలో బ్యారేజ్ గేట్లు మూసివేత.. యమునా నదిలో తగ్గుతున్న వరద ఉధృతి

యమునా నదికి వరద ఉధృతి తగ్గుముఖం పట్టినా ఢిల్లీలోని పలు ప్రాంతాలు వరద నీటిలోనే ఉన్నాయి. ఢిల్లీ ఎర్రకోటపై యమునా వరద ప్రభావం పడింది. ఆ ప్రాంతాన్ని అధికారులు మూసివేశారు.

Yamuna River : ఢిల్లీకి ఊరట.. హర్యానాలో బ్యారేజ్ గేట్లు మూసివేత.. యమునా నదిలో తగ్గుతున్న వరద ఉధృతి

Yamuna River

Delhi Floods: దేశ రాజధాని ఢిల్లీ వరదల్లో చిక్కుకుంది. యమునా నదిలో వరద ప్రవాహం అత్యంత ప్రమాదకర స్థాయినిదాటి ప్రవహించడంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు వణికిపోయారు. ఢిల్లీలోని సీఎం నివాసం, ఢిల్లీ ఎల్జీ నివాసంను వరద నీరు చుట్టుముట్టింది. సివిల్ లైన్స్ ప్రాంతంలో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ ఇళ్ళు నీట మునిగాయి. అయితే, ప్రస్తుతం యమునా నదిలో వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. హత్నికుండ్ బ్యారేజ్ గేట్లను హర్యానా ప్రభుత్వం మూసివేయడంతో నదిలోకి వరదనీటి ప్రవాహం తగ్గింది. దీనికితోడు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నదిలోకి వరద నీరు ఉధృతి తగ్గడంతో ఢిల్లీ ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నాయి.

Yamuna River : ఈ రాత్రికి ఢిల్లీ మునిగిపోతుందా? అత్యంత భయానకంగా యమునా నది ప్రవాహం

తగ్గుముఖం పట్టిన వరద ఉధృతి ..

యమునా నదిలో వరద ప్రవాహం డేంజర్ స్థాయికి చేరుకుంది. బుధవారం అర్థరాత్రి వరకు యుమన నీటి మట్టం 208.05 మీటర్లకు చేరుకోగా, గురువారం వరద ఉధృతి ఎక్కువ కావటంతో ఉదయం 7గంటలకు యమునా నీటి మట్టం 208.46 మీటర్లుకు చేరుకుంది. గతంలో ఎప్పుడూలేని స్థాయిలో యమునా నదిలో వరద ఉధృతి పెరగడంతో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వరదనీటిలో మునిగిపోయాయి. తాజాగా ఎగువ ప్రాంతాలనుంచి నదిలోకి వచ్చే వరద నీరు తగ్గడంతో యమునా నది క్రమంగా శాంతిస్తోంది. శుక్రవారం ఉదయం 208.35 మీటర్లకు నదిలో వరద నీటి ఉధృతి తగ్గింది. క్రమంగా వరద ఉధృతి తగ్గుతుందని అధికారులు  పేర్కొన్నారు.

Yamuna River Floods : ఉప్పొంగి ప్రవహిస్తున్న యమునా నది..ఢిల్లీకి వరద ముప్పు

వరద నీటిలోనే పలు ప్రాంతాలు ..

యమునా నదికి వరద ఉధృతి తగ్గుముఖం పట్టినా ఢిల్లీలోని పలు ప్రాంతాలు వరద నీటిలోనే ఉన్నాయి. ఢిల్లీ ఎర్రకోటపై యమునా వరద ప్రభావం పడింది. ఆ ప్రాంతాన్ని అధికారులు మూసివేశారు. వరద పరిస్థితుల నేపధ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీలో అన్ని ప్రాంతాల్లో 4,500 మంది పోలీసులు మోహరించారు. వరద ముంపు కారణంగా వజీరాబాద్ రింగ్ రోడ్డును మూసివేశారు. వరద ప్రభావంతో NH 44 మూసివేశారు. సాయంత్రానికి వరద ఉధృతి తగ్గితే NH 44 తెరిచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

యమునా నది వరద ఉధృతిపై ఆప్ పిడబ్ల్యూడి మంత్రి అతిశీ మాట్లాడుతూ.. ఢిల్లీ రిజర్వాయర్‌గా మారింది. ఢిల్లీలోని మురుగు కాలువలన్నీ నిండిపోయాయి. ఐటిఓ నుండి నీరు పాత ఢిల్లీలోని కాలువలలోకి ప్రవహిస్తుంది. కానీ, ఎర్రకోట చుట్టూ వరదలు రావడంతో పాత కాలువలన్నీ ముసుకుపోయాయని తెలిపారు. ఢిల్లీ వరద కట్టడి సామర్ధ్యాలు పరీక్షించబడుతున్నాయి. అధికార యంత్రాంగం 24గంటలు పని చేస్తోంది. NDRF ఆర్మీ ఇంజినీరింగ్ వింగ్ మద్దతు అందిస్తోంది. ఢిల్లీలో పరిస్థితి సాధారణ స్థితికి రావడానికి 10-12 గంటలు పడుతుందని భావిస్తున్నామని అతిశీ తెలిపారు.