Redmi Note 11S Sale : రెడ్‌మి నోట్ 11S ఫస్ట్ టైం సేల్ మొదలైంది.. ఫీచర్లు, లాంచ్ ఆఫర్లు ఇవే..!

చైనీస్ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్ మి నుంచి లాంచ్ అయిన (Redmi Note 11S) ఫస్ట్ టైం సేల్ మొదలైంది. ఫిబ్రవరి 21నుంచి ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ మొదలైంది.

Redmi Note 11S Sale : రెడ్‌మి నోట్ 11S ఫస్ట్ టైం సేల్ మొదలైంది.. ఫీచర్లు, లాంచ్ ఆఫర్లు ఇవే..!

Redmi Note 11s Sale Redmi Note 11s To Go On Sale Today Price, Launch Offers And More (1)

Redmi Note 11S First Time Sale : ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్ మి నుంచి లాంచ్ అయిన (Redmi Note 11S) ఫస్ట్ టైం సేల్ మొదలైంది. ఫిబ్రవరి 21నుంచి ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్ అందరికి అందుబాటులోకి వచ్చేసింది. ఇటీవలే మార్కెట్లో లాంచ్ అయిన ఈ రెడ్ మి నోట్ 11ఎస్ ఫోన్.. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి దేశీయ మార్కెట్లో అందుబాటులో వచ్చేసింది. ఆసక్తి కలిగిన రెడ్ మి స్మార్ట్ ఫోన్ యూజర్లు Mi.com, Amazon India ఈ కామర్స్ వెబ్ సైట్ ద్వారా (Redmi Note 11S) స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసుకోవచ్చు. ఈ ఫోన్ ఆక్టా కోర్ మీడియా టెక్ ప్రాసెసర్, 5000mAh బ్యాటరీ సామర్థ్యంతో వచ్చింది. అలాగే Android 11 ఆపరేటింగ్ సిస్టమ్ పై రన్ అవుతుంది. AMOLED డిస్‌ప్లేతో స్మార్ట్ ఫోన్ యూజర్లను ఆకట్టుకునేలా ఉంది.

Redmi Note 11S ధర, లాంచ్ ఆఫర్లు ఇవే :
ఈ రెడ్ మి కొత్త స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్‌లో భాగంగా మూడు వేరియంట్లలో లభిస్తోంది. 6GB+64GB, 6GB+128GB, 8GB+128GB వేరియంట్లలో ఒక్కొక్కటి వరుసగా రూ.16,499, రూ.17,499, రూ.18,499 ధరలతో అందుబాటులో ఉన్నాయి. ఈ మూడు వేరియంట్లు Horizon Blue, Polar White, Space Black కలర్ ఆప్షన్లలో ఉంది. ఇక లాంచ్ ఆఫర్ల విషయానికి వస్తే.. Bank Of Baroda కస్టమర్లకు ఈ స్మార్ట్ ఫొన్ కొనుగోలుపై రూ.1000 వరకు ఇన్ స్టంట్ డిస్కౌంట్ ఆఫర్ పొందవచ్చు. అంతేకాదు.. రిటైల్ స్టోర్లలో No-Cost EMI, Exchange Offers పొందవచ్చు. ZestMoney ద్వారా స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై కస్టమర్‌లు రూ. 1,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

Redmi Note 11s Sale Redmi Note 11s To Go On Sale Today Price, Launch Offers And More

Redmi Note 11S స్పెసిఫికేషన్స్ :
Redmi Note 11S 6GB/8GB RAM, ఆక్టా-కోర్ MediaTek Helio G96 ప్రాసెసర్ తో వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజ్ (64GB, 128GB) వేరియంట్‌లలో లభిస్తోంది. మైక్రో SD కార్డ్‌ ద్వారా కస్టమర్లు తమ ఫోన్ స్టోరేజీని మరింత విస్తరించుకోవచ్చు. Redmi Note 11S ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌ను MIUI 13 కంపెనీ ఓన్ లేయర్‌తో అందిస్తోంది. స్మార్ట్‌ఫోన్ 1080×2400 పిక్సెల్ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.43-అంగుళాల పూర్తి HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. మిడిల్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ క్వాడ్-రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

ఇందులో f/1.9 ఎపర్చరుతో 108MP మెయిన్ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP డెప్త్, f/2.4 ఎపర్చర్‌తో 2MP మాక్రో కెమెరాలు ఉన్నాయి. ఫ్రంట్ సైడ్‌లో f/2.4 ఎపర్చర్‌తో 16MP సెల్ఫీ షూటర్ ఉంది. స్మార్ట్‌ఫోన్ స్ప్లాష్-రెసిస్టెంట్ డిజైన్‌తో వస్తోంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 mAh బ్యాటరీని అందిస్తోంది.

Read Also : Redmi Note 10S : 8GB RAMతో భారత్‌కు రెడ్‌మి నోట్ 10S స్మార్ట్‌ఫోన్.. ధర ఎంతంటే?