Redmi Note 12 5G Series : వచ్చే జనవరిలోనే 3 కొత్త మోడళ్లతో రెడ్‌మి నోట్ 12 5G ఫోన్ వచ్చేస్తోంది.. ఏ మోడల్ ధర ఎంత ఉండొచ్చుంటే?

Redmi Note 12 5G Series : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ (Xiaomi) సబ్ బ్రాండ్ రెడ్‌మి (Redmi) నుంచి సరికొత్త రెడ్‌మి నోట్ 12 5G ఫోన్ వచ్చేస్తోంది. భారత మార్కెట్లో 2023 జనవరిలో ఈసారి మొత్తం 3 మోడళ్లలో రెడ్‌మి 5G ఫోన్ లాంచ్ కానుంది.

Redmi Note 12 5G Series : వచ్చే జనవరిలోనే 3 కొత్త మోడళ్లతో రెడ్‌మి నోట్ 12 5G ఫోన్ వచ్చేస్తోంది.. ఏ మోడల్ ధర ఎంత ఉండొచ్చుంటే?

Redmi Note 12 5G is launching in India next month, what could be the price

Redmi Note 12 5G Series : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ (Xiaomi) సబ్ బ్రాండ్ రెడ్‌మి (Redmi) నుంచి సరికొత్త రెడ్‌మి నోట్ 12 5G ఫోన్ వచ్చేస్తోంది. భారత మార్కెట్లో 2023 జనవరిలో ఈసారి మొత్తం 3 మోడళ్లలో రెడ్‌మి 5G ఫోన్ లాంచ్ కానుంది. అందులో Redmi Note 12, Redmi Note 12 Pro, Redmi Note 12 Pro Plusతో సహా ఈ మూడింటిలో రెడ్‌మి నోట్ 12 చౌకైన మోడల్ కానుంది. రెడ్‌మి నోట్ 12 ప్రో ప్లస్ మాత్రం అత్యంత ఖరీదైన వేరియంట్. అలాగే, Redmi Note 12 సిరీస్‌ కూడా సరసమైన ధరకే రానుంది.

ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన Realme 10 సిరీస్‌ల మాదిరిగానే ఉండే అవకాశం ఉంది. Redmi Note 12 ఇప్పటికే చైనాలో లాంచ్ అయింది. కానీ, భారత మార్కెట్లో రాబోయే మోడల్ మాత్రం అది కాదనే చెప్పాలి. Redmi Note 12 చైనా మోడల్ వెనుక ప్యానెల్‌లో డ్యూయల్ కెమెరాలతో వస్తుంది. భారత మార్కెట్లో రానున్న Redmi వేరియంట్ 3 కెమెరాలతో వస్తుంది. కెమెరా సెటప్‌లో తేడాతో పాటు, చైనీస్, భారత్ మోడల్‌ల ఇతర స్పెసిఫికేషన్‌లు ఫోన్‌లో ఒకే విధంగా ఉంటాయని భావిస్తున్నారు.

Redmi Note 12 5G is launching in India next month, what could be the price

Redmi Note 12 5G is launching in India next month, what could be the price

రెడ్‌మి Note 12 5G స్పెసిఫికేషన్లు ఇవే :
ఈ ఫోన్ లాంచ్‌కు ముందు.. డివైజ్‌కు సంబంధించి అనేక వివరాలను వెల్లడించింది. ఈ వారం ప్రారంభంలో Redmi Note 12 5G మోడల్ కొన్ని కీలక స్పెసిఫికేషన్‌లతో అమెజాన్ ఇండియా (Amazon India) వెబ్‌సైట్‌లో లిస్టు అయింది. ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లోని టీజర్‌లో రెడ్‌మి నోట్ 12 5G ఫోన్ 48 MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుందని వెల్లడించింది. అంటే.. చైనీస్ మోడల్‌ను పోలి ఉంటుంది. ఇతర కెమెరా వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. రాబోయే Redmi Note 12 5G సెంటర్ పంచ్-హోల్ నాచ్‌తో AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని అమెజాన్ టీజర్ వెల్లడించింది.

Read Also : Redmi K60 Series : వచ్చే జనవరిలో రెడ్‌మి K60 సిరీస్ వస్తోంది.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్..!

Qualcomm Snapdragon ప్రాసెసర్‌తో ఆధారితమైనదిగా చెప్పవచ్చు. చైనీస్ మోడల్ Qualcomm Snapdragon 4 Gen 1 ప్రాసెసర్‌తో వస్తుంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ ఇస్తుంది. Redmi Note 12 5G ఇప్పటివరకు లాంచ్ చేసిన అత్యంత సన్నని రెడ్‌మి నోట్ ఫోన్ అని అమెజాన్ వెల్లడించింది.

Redmi Note 12 5G ఫోన్ చైనీస్ వేరియంట్ 5000mAh బ్యాటరీ యూనిట్, 120hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల Full HD డిస్‌ప్లే, 8GB వరకు RAM సపోర్టు, 256GB ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంది. లీక్‌ల ప్రకారం.. ఈ ఫోన్ భారతీయ మోడల్ కూడా అన్ని ఫీచర్లను అందిస్తుంది.

Redmi Note 12 5G is launching in India next month, what could be the price

Redmi Note 12 5G is launching in India next month

భారత్‌లో Redmi Note 12 ధర (అంచనా) :
ధర విషయానికొస్తే.. Redmi Note 12 5G చైనాలో బేస్ 4GB RAM, 128GB స్టోరేజ్ మోడల్ ధర CNY 1199 వద్ద ప్రారంభమవుతుంది. భారత కరెన్సీలో ఈ ఫోన్ ధర దాదాపుగా రూ. 13500కి దగ్గరగా ఉంటుంది. మూడు ఇతర మోడల్‌లు కూడా ఉన్నాయి. అందులో 6GB RAM + 128GB స్టోరేజీ, 8GB RAM + 128GB, 8GB RAM + 256GB ధర CNY 1299 (సుమారు రూ. 14500), CNY 1499 (దాదాపు రూ. 1490), CNY 1699 (దాదాపు రూ. 19300) ఉండనున్నాయి.

రెడ్‌మి కంపెనీ ఇంకా Redmi Note 12 5G భారతీయ ధరను వెల్లడించలేదు. చైనాలో అందుబాటులో ఉన్న మోడల్ కన్నా భారతీయ మోడల్ మెరుగైన కెమెరా ఫీచర్లను ఆఫర్ చేస్తోంది. ఈ ఫోన్ ధర భారత మార్కెట్లో ఎక్కడో రూ. 15వేల వరకు ఉంటుందని భావించవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Redmi Note 12 Pro Plus 5G : 200MP కెమెరాతో రెడ్‌మి నోట్ 12 ప్రో ప్లస్ 5G ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్ డేట్ ఎప్పుడంటే?