Air India: టాటా గ్రూప్ చేతుల్లోకి ఎయిరిండియా వార్తలు అవాస్తవం: ప్రభుత్వం

అప్పుల్లో కూరుకుపోయిన ఎయిరిండియాని 68 ఏళ్ల త‌ర్వాత ఆ సంస్థ అస‌లు య‌జ‌మాని టాటా గ్రూప్ చేతికి వెళ్లింనట్లుగా వచ్చిన వార్తలను ఖండించింది కేంద్రప్రభుత్వం.

Air India: టాటా గ్రూప్ చేతుల్లోకి ఎయిరిండియా వార్తలు అవాస్తవం: ప్రభుత్వం

Air India Sale, Tata Gets Maharaja, Air India Employees, Tata Sons

Air India: అప్పుల్లో కూరుకుపోయిన ఎయిరిండియా… 68 ఏళ్ల త‌ర్వాత ఆ సంస్థ అస‌లు య‌జ‌మాని టాటా గ్రూప్ చేతికి వెళ్లినట్టుగా వచ్చిన వార్తలను ఖండించింది కేంద్రప్రభుత్వం. అత్య‌ధిక బిడ్ దాఖ‌లు చేసిన టాటా గ్రూప్.. ఎయిరిండియాను తిరిగి సొంతం చేసుకుందన్న బ్లూమ్‌బర్గ్ రాసిన క‌థ‌నం తప్పు అని ప్రభుత్వం వివరణ ఇచ్చింది.

ఎయిరిండియా పెట్టుబ‌డుల ఉపసంహ‌ర‌ణలో ఆర్థిక బిడ్లను ప్ర‌భుత్వం ఆమోదించింద‌న్న మీడియా వార్త‌ల్లో నిజం లేదని ఆర్థిక శాఖ తన ప్రకటనలో తెలిపింది. ఎయిరిండియా ప్రైవేటీకరణ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా ముందుగా మీడియాకు చెబుతామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఎయిరిండియా ప్రైవేటీకరణ  కోసం గత డిసెంబ‌ర్‌లో ప్ర‌భుత్వం బిడ్ల‌ను ఆహ్వానించింది. ఎయిరిండియా కోసం బిడ్లు వేసేందుకు న‌లుగురు మాత్ర‌మే ముందుకు వచ్చారు. అందులో టాటా గ్రూప్ మాత్ర‌మే చివ‌రి ద‌శ వ‌ర‌కూ వ‌చ్చింది. 2018, మార్చిలోనూ ఎయిరిండియాను అమ్మ‌డానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించినా కుదరలేదు.

నేషనల్ క్యారియర్ కంట్రోల్ ను ప్రభుత్వానికి అప్పగించిన ఇన్నేళ్ల తర్వాత టాటా గ్రూప్… మళ్లీ ఎయిర్ ఇండియా సంస్థను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఐతే… ఎయిరిండియా డిజ్ ఇన్వెస్ట్‌మెంట్ లో…. టాటా సంస్థ వేసిన బిడ్‌ లను ఆమోదించినట్టుగా మీడియాలో వచ్చిన వార్తలు కరెక్ట్ కాదని ఇన్వెస్ట్‌మెంట్ , పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ ట్వీట్ చేసింది.