Komatireddy Venkat Reddy: రేవంత్‌ రెడ్డి.. నన్ను రెచ్చగొట్టొద్దు: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిపై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎంపీ, ఆ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రాందీ షాపులు పెట్టుకునే వాళ్లంటూ రేవంత్ వ్యాఖ్యానించడం సరికాదన్నారు. వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలన్నారు.

Komatireddy Venkat Reddy: రేవంత్‌ రెడ్డి.. నన్ను రెచ్చగొట్టొద్దు: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Updated On : August 3, 2022 / 8:36 PM IST

Komatireddy Venkat Reddy: కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రాందీ షాపులు పెట్టుకునే వాళ్లంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలని సూచించారు. బుధవారం సాయంత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు.

Haryana: కూతురుకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చినందుకు వైద్య సిబ్బందిపై తండ్రి దాడి

ఈ సందర్భంగా రేవంత్‌పై ఫైర్ అయ్యారు. ‘‘రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదు. రాజ గోపాల్ రెడ్డి తనకు ఇష్టం ఉన్న పార్టీలోకి వెళ్తారు. మేం బ్రాందీ షాపులు పెట్టుకునే వాళ్లమని మాట్లాడతారా? బ్రాండ్ కాదు.. బ్రాందీ షాపని మాట్లాడతారా? పీసీసీ చీఫ్‌గా ఉన్న వ్యక్తి అలా మాట్లాడతారా? మీరు అనే పదాన్ని వెనక్కు తీసుకోవాలి. మీరు అని కుటుంబాన్ని ఎందుకు టార్గెట్ చేశారు? కోమటిరెడ్డి బ్రదర్స్ నిజాయితీగా ఉన్న వాళ్లం. రేవంత్ రెడ్డి.. నన్ను రెచ్చగొట్టొద్దు. ఆయన తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలి. వెంటనే రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి. నేను రాజకీయాల్లోకి వచ్చే నాటికి రేవంత్ పుట్టలేదు. ఆయనపై నేనెవరికీ ఫిర్యాదు చేయను’’ అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు.

Delivery Boy: తండ్రికి యాక్సిడెంట్.. అతడి స్థానంలో ఫుడ్ డెలివరీ చేస్తున్న ఏడేళ్ల కొడుకు

దీంతో కోమటిరెడ్డికి, రేవంత్ రెడ్డికి మధ్య నడుస్తున్న కోల్డ్‌వార్ మరోసారి బయటపడ్డట్లైంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఉన్న విబేధాల్ని మరోసారి బహిర్గతం చేస్తోంది. మరోవైపు బీజేపీకి చెందిన నేతలు కూడా రేవంత్ రెడ్డి‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.