RGV : తెలుగు ఇండస్ట్రీలో ఆర్జీవీ మరో కొత్త ప్రయోగం.. డిజిటల్ కరెన్సీతో సినిమా కొనొచ్చు

రామ్‌ గోపాల్‌ వర్మ డైరక్ట్‌చేసిన 'డేంజరస్‌' సినిమాను బ్లాక్‌ చెయిన్‌ ఎన్‌ఎఫ్‌టీగా అమ్ముతున్నామని ఆర్జీవీ ట్విట్టర్ లో తెలిపారు. 90 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ఎన్‌ఎఫ్‌టీ రూపంలో

RGV : తెలుగు ఇండస్ట్రీలో ఆర్జీవీ మరో కొత్త ప్రయోగం.. డిజిటల్ కరెన్సీతో సినిమా కొనొచ్చు

Rgv Nft (1)

RGV :  కొత్త కొత్త ప్రయోగాలు చేయడమంటే ఆర్జీవికి సరదా. సినిమా పరంగా తెలుగు పరిశ్రమకి ఎప్పటికప్పుడు కొత్త కొత్త టెక్నాలజీలని పరిచయం చేస్తూ ఉంటాడు ఆర్జీవీ. ఇక ఆ సినిమాని మార్కెట్ చేసే విధానం కూడా కొత్తగా చేయడానికి ట్రై చేస్తాడు. కరోనా మొదట్లో అందరు ఇళ్లల్లో కూర్చుంటే ఆర్జీవీ మాత్రం ఏటిటి అంటూ పే పర్ వ్యూ పద్ధతిన సినిమాలు రిలీజ్ చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. కేవలం రిలీజ్ చేయడమే కాక బిజినెస్ పరంగా సక్సెస్ కూడా సాధించాడు. తాజాగా మరోసారి తన సినిమాని కొత్తగా మార్కెట్ చేస్తున్నాడు ఆర్జీవీ.

Huzurabad : హుజూరాబాద్ ఉప ఎన్నిక…నేటితో ప్రచారానికి తెర

భారత్‌లో ఇప్పటికే క్రిప్టోకరెన్సీ మెల్లి మెల్లిగా విస్తరిస్తుంది. దీనికి సమానంగా పలు సెలబ్రిటీలు నాన్‌ఫంజిబుల్‌ టోకెన్స్‌ (ఎన్‌ఎఫ్‌టీ) పై ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ఈ ‘ఎన్‌ఎఫ్‌టీ’తో ఆర్జీవీ కొత్త చిత్రం డేంజరస్ ని మార్కెటింగ్ చేస్తున్నాడు. ఎన్‌ఎఫ్‌టీ తో ఈ సినిమాని చూడొచ్చు, కొనొచ్చు. మనలో చాలా మందికి ఎన్‌ఎఫ్‌టీ అంటే ఏంటో తెలీదు. కానీ విదేశాల్లో చాలా మంది సెలబ్రిటీలు ఈ ఎన్‌ఎఫ్‌టీని ఇప్పటికే వాడుతున్నారు. ఇటీవల బాలీవుడ్, ఇండియన్ క్రికెట్ లో అమితాబ్ బచ్చన్‌, సన్నిలియోన్‌, సల్మాన్‌ ఖాన్‌, దినేష్‌ కార్తీక్‌, రిషబ్‌పంత్‌… లాంటి వాళ్ళు ఈ ఎన్‌ఎఫ్‌టీ ని ఉపయోగించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు. తాజగా ‘డేంజరస్’ సినిమాతో ఎన్‌ఎఫ్‌టీని తెలుగు పరిశ్రమకి పరిచయం చేసి కొత్త అధ్యాయానికి తెర తీశారు ఆర్జీవీ.

Rajinikanth : రజినీకాంత్ కి ఈ పని రాదు.. అందుకే కొత్త సోషల్ మీడియా ప్లాట్ఫామ్..

ఎన్‌ఎఫ్‌టీ అంటే క్రిప్టో కరెన్సీ లాగే డిజిటల్‌ ఆస్తులు. ఈ ఎన్‌ఎఫ్‌టీలో సెలబ్రిటీలకు సంబంధించిన మాటలు, పాటలు, ఆటలు, నటన, ప్రత్యేక సంభాషణలు, వీడియోలను సైతం డిజిటల్‌ ఫార్మాట్‌లోకి మార్చి బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ ఆధారంగా వేలంలో అమ్మేస్తారు. క్రిప్టో కరెన్సీ ఎంత భద్రంగా ఉంటుందో ఈ ఆర్ట్‌ వర్క్‌ కూడా అంతే భద్రంగా ఉంటుంది. సెలబ్రిటీలకు సంబంధించిన ఈ డిజిటల్‌ ఎస్సెట్స్‌, దాన్ని సొంతం చేసుకున్న వ్యక్తులకే చెందుతుంది. వాటిని కొనుక్కున్న వాళ్ళు మళ్ళీ తిరిగి వేలం కూడా వేసుకోవచ్చు. ఇలా వేలం జరిగిన ప్రతిసారి వేలం అమౌంట్‌లో 10 శాతం ఎన్‌ఎఫ్‌టీ క్రియోటర్‌కు వెళుతుంది.

Bigg Boss 5 : బిగ్ బాస్ లో చింపేసిన సిరి లేఖ ఇదే.. బయటకి రాగానే పెళ్లి చేసుకుందాం..

రామ్‌ గోపాల్‌ వర్మ డైరక్ట్‌చేసిన ‘డేంజరస్‌’ సినిమాను బ్లాక్‌ చెయిన్‌ ఎన్‌ఎఫ్‌టీగా అమ్ముతున్నామని ఆర్జీవీ ట్విట్టర్ లో తెలిపారు. 90 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ఎన్‌ఎఫ్‌టీ రూపంలో కూడా ప్రేక్షకులకు అందుబాటులో ఉంటుందన్నారు. ‘డేంజరస్‌’ సినిమాను థియేటర్స్‌లోనే కాకుండా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో, పే పర్‌ వ్యూ ద్వారా కూడా ప్రేక్షకులు చూడొచ్చు. ఈ సినిమాను డేంజరస్‌ టోకెన్స్‌ లేదా క్రిప్టోకరెన్సీతో మన ఇండియన్‌ కరెన్సీతో కొనుగోలు చేసి కొనుక్కోవచ్చు. అందుకోసం సపరేట్‌గా rgvdangertoken.com వెబ్‌సైట్‌ను కూడా తయారు చేశారు.

RC15 : స్టార్ హీరోల్ని విలన్స్ గా మార్చిన రామ్ చరణ్.. భారీగా ప్లాన్ చేసిన శంకర్

‘డేంజరస్‌’ సినిమాను ప్రేక్షకులు డేంజర్‌ టోకెన్లతో కొనుగోలు చేయొచ్చు. డేంజరస్‌ సినిమాను డేంజరస్ టోకెన్స్ లో సుమారు 6 లక్షల యూనిట్లుగా విలువగట్టారు. ఒకో యూనిట్‌ ధర 100 రూపాయలకి సమానం. ఇన్వెస్టర్లు 5 లక్షల యూనిట్లను సొంతం చేసుకోవచ్చు. ఒకే ఇన్వెస్టర్‌ మొత్తం కూడా దక్కించుకోవచ్చు. మిగిలిన లక్ష యూనిట్లను ఆర్జీవీ, చిత్ర బృందం దగ్గరే ఉంచుకున్నారు. దీనివల్ల సినిమా నుంచి వచ్చే లాభాలను ఈ డేంజరస్ టోకెన్ల ద్వారా సినిమా కొన్న ఇన్వెస్టర్లు కూడా పొందుతారు. పే పర్‌ వ్యూ, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో వచ్చిన వ్యూస్‌ మేరకు ఇన్వెస్టర్లకు డబ్బులు కేటాయించడం జరుగుతుంది అని చిత్ర బృందం తెలిపారు. ఇప్పటికే కొంతమంది ఈ ఎన్‌ఎఫ్‌టీ లో డేంజరస్ టోకెన్స్ ని కొనుగోలు చేశారు.

Balakrishna : మోహన్ బాబుతో మొదలు పెట్టనున్న బాలకృష్ణ

పరిశ్రమలోని సినిమాలు అన్ని హిట్ ప్లాప్ ల మధ్య ఊగిసలాడుతుంటే ఆర్జీవీ మాత్రం హిట్ ప్లాప్ కి సంబంధం లేకుండా ప్రతి సినిమాని కొత్తగా బిజినెస్ చేస్తున్నాడు. ఆర్జీవీ తెలివికి మెచ్చుకోకుండా ఉండలేము.