RC15 : స్టార్ హీరోల్ని విలన్స్ గా మార్చిన రామ్ చరణ్.. భారీగా ప్లాన్ చేసిన శంకర్

ఇప్పటికే ‘ఆర్‌సీ15’ చిత్రీకరణ పుణెలో ప్రారంభమైంది. ఇందులో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ విలన్ రోల్ చేయనున్నాడని సమాచారం. సునీల్ కూడా

RC15 : స్టార్ హీరోల్ని విలన్స్ గా మార్చిన రామ్ చరణ్.. భారీగా ప్లాన్ చేసిన శంకర్

Rc15

RC15 :  భారీ బడ్జెట్స్ తో సినిమాలు తీసి హిట్ కొట్టాలి అంటే దర్శకుడు శంకర్‌ ముందుంటాడు. ఆయన సినిమాలు, ఆయన బడ్జెట్ లు ఎవరు ఊహించనివి. ఇప్పటిదాకా తమిళ్ సినిమాలు చేసి వాటిని తెలుగులో కూడా రిలీజ్ చేశారు. ఫస్ట్ టైం తెలుగులో డైరెక్ట్ సినిమా చేస్తున్నారని తెలిసిందే. శంకర్ డైరెక్షన్‌లో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా రాబోతుంది. ఇది రామ్ చరణ్ 15వ సినిమా కాగా, దిల్ రాజు కి 50వ సినిమా కావడంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

Balakrishna : మోహన్ బాబుతో మొదలు పెట్టనున్న బాలకృష్ణ

ఇప్పటికే ‘ఆర్‌సీ15’ చిత్రీకరణ పుణెలో ప్రారంభమైంది. ఇందులో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ విలన్ రోల్ చేయనున్నాడని సమాచారం. సునీల్ కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. తాజాగా ఈ సినిమాకి మరో విలన్ ని తీసుకొచ్చినట్టు సమాచారం. ఈ సినిమాని తెలుగుతో పాటు పాన్ ఇండియా కూడా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు చిత్ర బృందం. అందుకే అన్ని పరిశ్రమల నుంచి ఒక్క యాక్టర్ ని అయినా తీసుకుంటున్నారు. తాజాగా మలయాళం స్టార్ హీరో సురేష్ గోపిని రామ్ చరణ్ కి విలన్ గా తీసుకున్నట్టు సమాచారం. సురేష్ గోపి అంతకు ముందే శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ‘ఐ’ సినిమాలో కూడా విలన్ గా నటించారు. అందులో తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు సురేష్ గోపి. దీంతో శంకర్ మరోసారి సురేష్ గోపిని విలన్ గా చూపించబోతున్నారని తెలుస్తుంది. అంతే కాకుండా ఇందులో సురేశ్‌ గోపి భార్యగా బాలీవుడ్ హీరోయిన్ ఇషాగుప్తా నటించనున్నారని, ఆమెది కూడా నెగెటివ్‌ రోల్‌ అని సమాచారం.

Badvel By-Election : బద్వేల్ ఉప ఎన్నిక.. నేటితో ప్రచారానికి తెర…

 

శంకర్ ప్లాన్స్ చూస్తుంటే రామ్ చరణ్ సినిమాని కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్ లో అందరూ సూట్స్ వేసుకొని ఉండటం, పోస్టర్ కొంచెం డిఫరెంట్ గా ఉండటంతో ఇప్పటి నుంచే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.