RGV : చాలా చిన్నది అంటూ.. రాడిసన్ పబ్ ఘటనపై ఆర్జీవీ కామెంట్స్

తాజాగా ఆర్జీవీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాడిసన్ సంఘటనపై మాట్లాడుతూ.. ''ప్రస్తుతం సమాజంలో డ్రగ్స్‌ వాడటం అనేది చాలా కామన్‌గా మారింది. టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసుతో పోలిస్తే ఇది చాలా........

RGV : చాలా చిన్నది అంటూ.. రాడిసన్ పబ్ ఘటనపై ఆర్జీవీ కామెంట్స్

Rgv

 

RGV :  ఇటీవల పోలీసులు బంజారాహిల్స్​లోని ర్యాడిసన్ బ్లూ హోటల్‌పై దాడి చేయగా అక్కడ డ్రగ్స్ దొరికిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పబ్ లో ఉన్న 150 మందికి నోటీసులు కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. ఇక ఈ పబ్ ఘటనపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. తన చుట్టూ ఉండే అంశాలపై తనదైన శైలిలో స్పందించే ఆర్జీవీ కూడా ఈ ఘటనపై స్పందించారు.

తాజాగా ఆర్జీవీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాడిసన్ సంఘటనపై మాట్లాడుతూ.. ”ప్రస్తుతం సమాజంలో డ్రగ్స్‌ వాడటం అనేది చాలా కామన్‌గా మారింది. టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసుతో పోలిస్తే ఇది చాలా చిన్నది. మిగతా డ్రగ్స్ కేసులతో పోలిస్తే ఇది ఒక చిన్న షార్ట్ ఫిలిం లాంటిది అంతే. ముంబైలో నా అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌ టీ తాగినంత ఈజీగా డ్రగ్స్‌ తీసుకునేవారు. ఇది చాలా సర్వసాధారణ విషయం అక్కడ. నేను డ్రగ్స్ వాడను, ఒకేఒకసారి అవి ఎలా ఉంటాయా అని ట్రై చేశాను. ఆ తర్వాత మళ్ళీ వాటిని ముట్టుకోలేదు” అని తెలిపారు.

Radisson : తప్పుగా ప్రచారం చేస్తున్నారు అంటూ.. రాడిసన్ ఘటనపై స్పందించిన తమన్నా సింహాద్రి..

డ్రగ్స్ కామన్ అంటున్న ఆర్జీవీ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఎప్పటిలాగే ఈ వ్యాఖ్యలు కూడా వివాదానికి దారి తీస్తున్నాయి. ఆర్జీవీ ఈ ఘటనపై చేసిన వ్యాఖ్యలని వ్యతిరేకిస్తూ పలువురు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.