Salman Khan : నిన్న బాడీగార్డ్స్ నెట్టడం.. నేడు సల్మాన్ కౌగిలించుకోవడం.. విక్కీ కౌశల్ వీడియో వైరల్!
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ని IIFA 2023 అవార్డ్స్ లో నిన్న సల్మాన్ ఖాన్ బాడీ గార్డ్స్ పక్కకి నెట్టేసిన వీడియో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మరో వీడియో బయటకి వచ్చింది.

Salman Khan hugs Vicky Kaushal at IIFA 2023 awards video viral
Vicky Kaushal : బాలీవుడ్ స్టార్స్ ప్రస్తుతం దుబాయ్ లో జరుగుతున్న IIFA 2023 అవార్డ్స్ లో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, విక్కీ కౌశల్ కూడా ఆ ఈవెంట్ కి హాజరయ్యారు. అయితే ఆ అవార్డు వేడుకల్లో విక్కీ కౌశల్ కి ఒక చేదు అనుభవం ఎదురైంది. ఆ ఫంక్షన్ లో విక్కీ కౌశల్ ఒక అభిమానికి సెల్ఫీ ఇస్తున్న సమయంలో సల్మాన్ ఖాన్ అటుగా నడుచుకుంటూ వచ్చాడు. ఇక దారి మధ్యలో ఉన్న కౌశల్ ని సల్మాన్ బాడీ గార్డ్స్ హీరో అని కూడా పక్కకి నెట్టేశారు.
Salman Khan : బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్‌ని పక్కకి నెట్టేసిన సల్మాన్ బాడీగార్డ్స్.. వీడియో వైరల్!
అయినా సరి కౌశల్ సీరియస్ అవ్వకుండా సల్మాన్ కి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి, మాట్లాడడానికి ట్రై చేశాడు. కానీ సల్మాన్ తిరిగి షేక్ హ్యాండ్ ఇవ్వడం కాదు కనీసం సరిగా మాట్లాడాను లేదు. ఇక అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో.. అది చూసిన నెటిజెన్స్ సల్మాన్ అండ్ అతడి బాడీ గార్డ్స్ నిందిస్తూ కామెంట్స్ చేశారు. అయితే తాజాగా ఆ అవార్డు ఫంక్షన్ నుంచి మరో వీడియో బయటకి వచ్చింది. IIFA రెడ్ కార్పెట్ విక్కీ కౌశల్ ఒక మీడియా రిపోర్టర్ కి ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో సల్మాన్, విక్కీ దగ్గరకు తనకు తానుగా వెళ్లి.. విక్కీని కౌగిలించుకున్నాడు.
Salman Khan : 19 అంతస్థుల బిల్డింగ్‌ని.. ఆమె పేరున రిజిస్టర్ చేయించిన సల్మాన్.. నిజమేనా?
ఇక ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కాగా విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ ని (Katrina Kaif) ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే కత్రినా అండ్ సల్మాన్ మధ్య కొంత కాలం ప్రేమాయణం జరిగిందని బి-టౌన్ లో అప్పటిలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కత్రినా కైఫ్ ని సల్మాన్ బాలీవుడ్ లో పరిచయం చేయడమే కాకుండా తనకి స్టార్ స్టేటస్ ని తీసుకు వచ్చాడు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి టైగర్ 3 సినిమాలో నటిస్తున్నారు.
Megastar #SalmanKhan hugs Vicky kaushal at the #IIFA2023. #Tiger3pic.twitter.com/6eTgyxTTlA
— MASS (@Freak4Salman) May 26, 2023