Samantha: తాప్సి నిర్మాతగా సామ్ బాలీవుడ్ సినిమా!

సమంతా ఇప్పుడు మళ్ళీ ఎంత త్వరగా బిజీ అయితే అంత బెటర్ అని ఫీలవుతుంది. అందుకే వరసగా సినిమాలను కూడా ఒకే చేస్తుందని టాక్. చైతూతో డైవర్స్ తర్వాత ఆ బాధ నుండి బయటపడేందుకు ఇటు ఆధ్యాత్మిక..

Samantha: తాప్సి నిర్మాతగా సామ్ బాలీవుడ్ సినిమా!

Samantha

Samantha: సమంతా ఇప్పుడు మళ్ళీ ఎంత త్వరగా బిజీ అయితే అంత బెటర్ అని ఫీలవుతుంది. అందుకే వరసగా సినిమాలను కూడా ఒకే చేస్తుందని టాక్. చైతూతో డైవర్స్ తర్వాత ఆ బాధ నుండి బయటపడేందుకు ఇటు ఆధ్యాత్మిక యాత్రలతో పాటు స్నేహితులతో విహార యాత్రలతో ప్రపంచాన్ని చుట్టేస్తున్న సామ్.. త్వరలోనే కెరీర్ లో మళ్ళీ బిజీ అయ్యేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం సామ్ నటించిన శాకుంతలం, కత్తువాకుల రెండు కాదల్ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.

NBK 107: బాలయ్య కోసం భావన తెలుగులో రీ ఎంట్రీ?

ఇప్పటికే శ్రీదేవి మూవీస్ సినిమా.. డ్రీమ్ వారియర్ సినిమాలకు సామ్ చర్చలు పూర్తయి సంతకాలు కూడా చేసేసింది. మరోవైపు బాలీవుడ్ లో పాగా వేసేందుకు కూడా సన్నాహాలు మొదలు పెట్టింది. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో రాజీ పాత్రతో బాలీవుడ్ ఆడియెన్స్‌కి దగ్గరైన సామ్.. అప్పుడే బాలీవుడ్ ఆఫర్లు వచ్చినా వదిలేసుకుంది. కానీ, ఇప్పుడు మళ్ళీ బాలీవుడ్ మీద ఆసక్తి చూపిస్తుంది. ఇప్పటికే ఒక సినిమా ఫైనల్ అయినట్లు తెలుస్తుంది.

Akhanda: కొత్త రిలీజ్ డేట్.. బాలయ్య గర్జన ఎప్పుడంటే?

ఢిల్లీ భామ తాప్సి పన్ను ఇప్పుడు బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ మాత్రమే కాదు.. సొంత నిర్మాణ సంస్థ స్టార్ట్ చేసి సినిమాలను కూడా నిర్మిస్తుంది. కాగా, ఇప్పుడు సామ్ తో ఓ సినిమాకి ప్లాన్ చేస్తుందట. తాప్సి ఔట్ సైడర్స్ ఫిల్మ్స్ బ్యానర్ లో ఈ సినిమా నిర్మాణం కానుండగా ఇదొక యునిక్ థ్రిల్లర్ కథగా తెలుస్తుంది. ఈ ఒక్క సినిమా మాత్రమే కాదు.. సామ్ కు బాలీవుడ్ లో తాప్సి అండగా ఉండేందుకు సిద్ధమైందని సన్నిహితుల మాట.