Samantha : పాన్ ఇండియా సినిమా.. ‘యశోద’గా సమంత…

సమంత చేతిలో అయిదు సినిమాలు ఉన్నాయి. అందులో హాలీవుడ్ సినిమా కూడా ఉంది. సినిమాలే కాకుండా ఐటెం సాంగ్స్ కి కూడా ఓకే చెప్తుంది సమంత. ఇటీవల దసరాకి అనౌన్స్ చేసిన రెండు సినిమాల్లో......

Samantha : పాన్ ఇండియా సినిమా.. ‘యశోద’గా సమంత…

Saam

Samantha :  చైతూతో విడాకుల తర్వాత సమంత సినిమాల్లో దూసుకుపోతుంది. వరుస సినిమాలకు ఓకే చెప్తుంది. ఇప్పటికే సమంత చేతిలో అయిదు సినిమాలు ఉన్నాయి. అందులో హాలీవుడ్ సినిమా కూడా ఉంది. సినిమాలే కాకుండా ఐటెం సాంగ్స్ కి కూడా ఓకే చెప్తుంది సమంత. ఇటీవల దసరాకి అనౌన్స్ చేసిన రెండు సినిమాల్లో ఒకటి పాన్ ఇండియా సినిమాగా నిన్న అనౌన్స్ చేశారు.

Puneeth Rajkumar : గంధడ గుడి.. పునీత్ వైల్డ్‌లైఫ్‌ డ్యాక్యుమెంటరి టీజర్‌ రిలీజ్..

ఈ సినిమాకి ‘యశోద’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈ సినిమాని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు. థ్రిల్లర్ జాన‌ర్‌లో ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. ఈ సినిమాని శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మిస్తున్నారు. కొత్త డైరెక్షర్లు హరి, హరీశ్‌లు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ‘యశోద’ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ నిన్న పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో షూటింగ్ పూర్తి చేయాలని అనుకుంటున్నట్టు తెలిపారు.