Samsung Galaxy A34 5G : 25W ఛార్జింగ్ సపోర్టుతో శాంసంగ్ గెలాక్సీ A34 5G ఫోన్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Samsung Galaxy A34 5G : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) గెలాక్సీ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. అదే.. శాంసంగ్ గెలాక్సీ A34 5G ఫోన్.. దీని మోడల్ నంబర్ SM-A346Mతో అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (FCC) వెబ్‌సైట్‌లో కనిపించింది.

Samsung Galaxy A34 5G : 25W ఛార్జింగ్ సపోర్టుతో శాంసంగ్ గెలాక్సీ A34 5G ఫోన్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Samsung Galaxy A34 5G Surfaces on US FCC Website With Support for 25W Charging

Samsung Galaxy A34 5G : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) గెలాక్సీ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. అదే.. శాంసంగ్ గెలాక్సీ A34 5G ఫోన్.. దీని మోడల్ నంబర్ SM-A346Mతో అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (FCC) వెబ్‌సైట్‌లో కనిపించింది.

బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) సర్టిఫికేషన్ సైట్‌లో కనిపించిన కొద్దిసేపటికే అమెరికా రెగ్యులేటర్ వెబ్‌సైట్‌లో కనిపించింది. భారత్ సహా గ్లోబల్ మార్కెట్లో శాంసంగ్ Galaxy A34 5G త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ గెలాక్సీ A33 అప్‌గ్రేడ్ వెర్షన్‌గా రానుంది. MediaTek డైమెన్సిటీ 1080 SoC ద్వారా పవర్ అందిస్తుందని భావిస్తున్నారు.

My Smart Price నివేదిక ప్రకారం.. శాంసంగ్ Galaxy A34 5G మోడల్ నంబర్ SM-A346Eతో BIS వెబ్‌సైట్‌లో గుర్తించిన ఒక రోజు తర్వాత మోడల్ నంబర్ SM-A346Mతో FCC లిస్టులో కనిపించింది. నివేదిక ప్రకారం.. ఫోన్ 25W వైర్డు ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుందని FCC లిస్టు చూపిస్తుంది. ఈ జాబితాలకు ముందు శాంసంగ్ Galaxy A34 5G బ్లూటూత్ SIG డేటాబేస్, బెంచ్‌మార్కింగ్ వెబ్‌సైట్ గీక్‌బెంచ్‌లో కూడా కనిపించింది. దీనికి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్‌లను వెల్లడించింది.

Samsung Galaxy A34 5G Surfaces on US FCC Website With Support for 25W Charging

Samsung Galaxy A34 5G Surfaces on US FCC Website With Support for 25W Charging

Read Also : Infinix Note 12i (2022) India : ఇన్‌ఫినిక్స్ నోట్ 12i ఫోన్ వచ్చేస్తోంది.. జనవరి 25నే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

శాంసంగ్ గెలాక్సీ A34 5G 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.4-అంగుళాల సూపర్ AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంటుందని నివేదికలు సూచిస్తున్నాయి. MediaTek డైమెన్సిటీ 1080 SoC ద్వారా అందిస్తుందని భావిస్తున్నారు. ఇంతలో, పాత లీక్‌లో ఫోన్ గ్రాఫైట్, లైమ్, సిల్వర్, వైలెట్ అనే 4 కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఇతర డిజైన్ లీక్‌లు సెల్ఫీ కెమెరాను ఉంచేందుకు ఫోన్ డిస్‌ప్లేలో వాటర్‌డ్రాప్-శైలి కటౌట్‌ను కలిగి ఉంటుందని సూచిస్తున్నాయి.

రాబోయే శాంసంగ్ Galaxy A34 5G 48MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 5-MP మాక్రో లెన్స్‌తో సహా వెనుకవైపు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. దక్షిణ కొరియా టెక్ దిగ్గజం నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ భారత్‌లో మార్చి 2022లో లాంచ్ అయిన Samsung Galaxy A33 కి సక్సెసర్‌గా ఉంటుందని భావిస్తున్నారు.

ఈ ఫోన్ ధర రూ. 28,499గా ఉంది. ఆక్టా-కోర్ Exynos 1280 SoC, 8GB వరకు RAMతో రన్ అవుతుంది. శాంసంగ్ Galaxy A34 5Gతో పాటు, Samsung Galaxy A54 కూడా Samsung Galaxy A53 కి సక్సెసర్‌గా లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Motorola Edge 40 Pro : మోటోరోలా నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర, ఫీచర్లు లీక్..!