Samsung Galaxy F14 Launch : శాంసంగ్ నుంచి గెలాక్సీ F14 బడ్జెట్ సిరీస్ వచ్చేస్తోంది.. ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే?

Samsung Galaxy F14 Launch : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) త్వరలో భారత్‌ మార్కెట్లో మరో F సిరీస్ ఫోన్‌ను లాంచ్ చేయనుంది. 91Mobiles నివేదిక ప్రకారం.. దక్షిణ కొరియా కంపెనీ Samsung Galaxy F14ని జనవరి 2023లో లాంచ్ చేసే అవకాశం ఉంది.

Samsung Galaxy F14 Launch : శాంసంగ్ నుంచి గెలాక్సీ F14 బడ్జెట్ సిరీస్ వచ్చేస్తోంది.. ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే?

Samsung Galaxy F14 may launch in India soon, Here is The Details

Samsung Galaxy F14 Launch : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) త్వరలో భారత్‌ మార్కెట్లో మరో F సిరీస్ ఫోన్‌ను లాంచ్ చేయనుంది. 91Mobiles నివేదిక ప్రకారం.. దక్షిణ కొరియా కంపెనీ Samsung Galaxy F14ని జనవరి 2023లో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ Galaxy F13 తర్వాత మోడల్‌గా రానుంది. నివేదిక ప్రకారం.. Samsung Galaxy F14 దేశవ్యాప్తంగా Samsung e-స్టోర్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లతో పాటు Flipkart ద్వారా ప్రత్యేకంగా సేల్ అందుబాటులో ఉండనుంది.

ఈ డివైజ్ 5G కనెక్టివిటీని అందిస్తుందా లేదా అనేది ఇంకా రివీల్ కాలేదు. రాబోయే ఈ ఫోన్‌కు సంబంధించిన ఇతర వివరాలు వెల్లడి కాలేదు. శాంసంగ్ Galaxy F14 బడ్జెట్ ఫోన్.. శాంసంగ్ Galaxy F13 తర్వాత మోడల్ డిజైన్‌తో వస్తుందని అంచనా. Samsung Galaxy F13 భారత మార్కెట్లో 2022 ఏడాది ప్రారంభంలో లాంచ్ అయింది. బడ్జెట్ కేటగిరీ ఫోన్ కాగా.. దీని ప్రారంభ ధర రూ. 11,999 నుంచి అందుబాటులో ఉంది.

Samsung Galaxy F14 may launch in India soon, Here is The Details

Samsung Galaxy F14 may launch in India soon, Here is The Details

Read Also : Samsung Galaxy M-series : శాంసంగ్ గెలాక్సీ M-సిరీస్‌లో ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్.. ఈ ఆరు మోడళ్లలో కొత్త ఫీచర్లు.. కొత్త అప్‌డేట్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే?

Samsung Galaxy F14 ఫీచర్లు (అంచనా) :
శాంసంగ్ గెలాక్సీ F13 మాదిరిగానే శాంసంగ్ గెలాక్సీ F 14 ఫోన్ 6.6-అంగుళాల Full HD+ LCD స్క్రీన్‌తో వచ్చింది. ఈ ఫోన్ డిస్ప్లే ముందు కెమెరాపై వాటర్‌డ్రాప్ నాచ్‌ని కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా కంపెనీ సొంత One UI 4.0 కస్టమ్ స్కిన్‌పై రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ Mali G52తో Exynos 850 చిప్‌సెట్‌తో వస్తుంది. శాంసంగ్ Galaxy F13 4GB RAMతో 128GB వరకు స్టోరేజీని అందిస్తుంది. డ్యూయల్ సిమ్ ఫోన్, మైక్రో SD కార్డ్ స్లాట్‌తో వస్తుంది.

Samsung Galaxy F14 may launch in India soon, Here is The Details

Samsung Galaxy F14 may launch in India soon

వినియోగదారులు మైక్రో SD కార్డ్‌ని ఉపయోగించి డివైజ్ స్టోరేజీని విస్తరించవచ్చు. RAM విస్తరణకు కూడా సపోర్టు ఉంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. స్మార్ట్‌ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 50MP ప్రైమరీ సెన్సార్, 5MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 2MP మాక్రో షూటర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం Galaxy F13 ఫ్రంట్ సైడ్ 8MP కెమెరాను కలిగి ఉంది.

శాంసంగ్ Galaxy F13 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది. 15 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ని అందిస్తుంది. కొనుగోలుదారులు డివైజ్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా పొందవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లో అందుబాటులో ఉన్న కనెక్టివిటీ ఆప్షన్లు 4G, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.0, GPS, USB టైప్-C పోర్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Samsung Budget Phones : శాంసంగ్ నుంచి డ్యుయల్ కెమెరాలు, లాంగ్ బ్యాటరీతో రెండు కొత్త బడ్జెట్ ఫోన్లు.. ఏ మోడల్ ధర ఎంతంటే?