Samsung Galaxy S23 Series : శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్‌లో ఐఫోన్ 14 ఫీచర్ వస్తోంది.. అదేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. లాంచ్ ఎప్పుడంటే?

Samsung Galaxy S23 Series : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. వచ్చే ఏడాదిలో Samsung Galaxy S23 సిరీస్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. రాబోయే ఈ ఫోన్ ఫీచర్లపై అనేక రుమర్లు వినిపిస్తున్నాయి.

Samsung Galaxy S23 Series : శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్‌లో ఐఫోన్ 14 ఫీచర్ వస్తోంది.. అదేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. లాంచ్ ఎప్పుడంటే?

Samsung Galaxy S23 series may get this iPhone 14 feature

Samsung Galaxy S23 Series : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. వచ్చే ఏడాదిలో Samsung Galaxy S23 సిరీస్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. రాబోయే ఈ ఫోన్ ఫీచర్లపై అనేక రుమర్లు వినిపిస్తున్నాయి. ఈ సిరీస్ శాటిలైట్ కనెక్టివిటీతో వచ్చే అవకాశం ఉంది.

ఓ నివేదిక ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్‌లో శాటిలైట్ కనెక్టివిటీని చేర్చాలని కంపెనీ యోచిస్తోంది. శాంసంగ్ శాటిలైట్ కనెక్షన్ ఇరిడియం – గ్లోబల్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ కంపెనీ ద్వారా అందించవచ్చు. 66-బలమైన లో-ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ కాన్‌స్టెలేషన్‌తో ఈ ఫీచర్‌ను అందించేందుకు శాంసంగ్‌తో కలిసి పనిచేస్తున్నట్లు నివేదించింది.

ఆపిల్ ఐఫోన్లలో Apple iPhone 14, iPhone 14 Plus, iPhone 14 Pro, iPhone 14 Pro Max లో శాటిలైట్ కనెక్షన్‌ను అందిస్తుంది. గ్లోబల్‌స్టార్‌తో భాగస్వామ్యంతో ఈ ఫీచర్ పనిచేస్తుంది. మరోవైపు.. స్మార్ట్‌ఫోన్‌లలో శాటిలైట్ కనెక్టివిటీని చేర్చిన మొదటి స్మార్ట్‌ఫోన్ కంపెనీ Huawei అని చెప్పవచ్చు.

Samsung Galaxy S23 series may get this iPhone 14 feature

Samsung Galaxy S23 series may get this iPhone 14 feature

Read Also : Samsung Galaxy M04 : శాంసంగ్ గెలాక్సీ M04 స్మార్ట్ ఫోన్ వస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

శాంసంగ్ గత రెండేళ్లుగా ఈ ఫీచర్‌పై పనిచేస్తోంది. Apple కాకుండా, Galaxy S23 సిరీస్‌లోని శాటిలైట్ కనెక్షన్‌ని అత్యవసర పరిస్థితుల కన్నా ఎక్కువగా పనిచేస్తుంది. టెక్స్ట్ మెసేజ్‌లు, తక్కువ సామర్థ్యం గల ఫొటోల వంటి డేటాను అందించే లక్ష్యంతో” ఫీచర్‌ను డెవలప్ చేస్తోంది.

నివేదిక ప్రకారం.. రాబోయే Samsung Galaxy S23 డివైజ్‌లో ప్రాథమిక కెమెరా సెన్సార్‌గా 200MP కెమెరా సెన్సార్‌ను కలిగి ఉండవచ్చని Samsung Electronics మొబైల్ ఎక్స్‌పీరియన్స్ విభాగం ధృవీకరించింది. శాంసంగ్ నుంచి రాబోయే ఈ స్మార్ట్‌ఫోన్ 200MP కెమెరా సెన్సార్‌తో ఉన్న ఏకైక ఫోన్ అని చెప్పవచ్చు. Weiboలో టిప్‌స్టర్ ఐస్ యూనివర్స్ గతంలో స్మార్ట్‌ఫోన్ 5,000mAh బ్యాటరీతో బ్యాకప్‌తో రానుందని పేర్కొంది.

రాబోయే శాంసంగ్ S సిరీస్ ఫోన్ 228gm బరువు ఉంటుంది. ముందున్న Galaxy S22 Ultraకి సమానంగా ఉండవచ్చని చెప్పవచ్చు. రాబోయే సిరీస్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌సెట్ ద్వారా రానుందని భావిస్తున్నారు. బాక్స్ వెలుపల Android 13తో రావొచ్చు. Samsung Galaxy S23 సిరీస్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : iPhone 14 Flipkart Offer : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14పై అదిరే డీల్.. ఫీచర్లు అదుర్స్.. ఇలా చేస్తే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు..!