Samsung : శాంసంగ్ నుంచి కొత్త గెలాక్సీ M సిరీస్ ఫోన్.. జూలై 5నే లాంచ్..!

Samsung New Galaxy M: సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి గెలాక్సీ M సిరీస్ ఫోన్ వస్తోంది. భారత మార్కెట్లో ఈ కొత్త ఫోన్ లాంచ్ చేసేందుకు శాంసంగ్ ప్లాన్ చేస్తోంది.

Samsung : శాంసంగ్ నుంచి కొత్త గెలాక్సీ M సిరీస్ ఫోన్.. జూలై 5నే లాంచ్..!

Samsung To Launch A New Galaxy M Smartphone In India On July 5

Samsung New Galaxy M: సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి గెలాక్సీ M సిరీస్ ఫోన్ వస్తోంది. భారత మార్కెట్లో ఈ కొత్త ఫోన్ లాంచ్ చేసేందుకు శాంసంగ్ ప్లాన్ చేస్తోంది. సోషల్ మీడియాలో పోస్ట్ ప్రకారం.. ఈ ఫోన్‌ను Galaxy M33 లేదా గెలాక్సీ M35గా పిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే శాంసంగ్ Galaxy M33ని లాంచ్ చేయాలని కంపెనీ నిర్ణయించుకుంది. ఇప్పటికే Galaxy M33 5Gని విక్రయిస్తోంది. ఈసారి మార్కెట్లోకి 4G డివైజ్ తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. Galaxy M35 ఫోన్.. Galaxy M33 5G కన్నా అప్‌గ్రేడ్‌గా వస్తుంది. రాబోయే Galaxy M-సిరీస్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల వివరాలు ఇంకా రివీల్ చేయలేదు.

అధికారిక లాంచ్ తేదీ కన్నా ముందే ఫీచర్ల వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ లాంచ్ ఈవెంట్ వర్చువల్ కావచ్చు. ధరల పరంగా చూస్తే.. Samsung ఇప్పటికే Galaxy M33 5Gని రెండు వేర్వేరు RAM వేరియంట్‌లకు (వరుసగా 6GB 8GB) రూ. 17,999, రూ. 19,499కి విక్రయిస్తోంది. రాబోయే ఈ ఫోన్ ధరను దాదాపు రూ. 20,000కు విక్రయించే అవకాశం ఉంది. శాంసంగ్ M33 4G వేరియంట్ అయితే.. ఫోన్ ధర రూ. 15,000 నుంచి 20,000 వరకు ఉండవచ్చు. మరోవైపు, Galaxy M35ని చూసినట్లయితే.. ఫోన్ ధర రూ. 20,000 కన్నా ఎక్కువగా ఉండవచ్చు. అంటే.. రూ. 22,000 వరకు ధర ఉండొచ్చని అంచనా.

Samsung To Launch A New Galaxy M Smartphone In India On July 5 (1)

Samsung To Launch A New Galaxy M Smartphone In India On July 5 

స్పెసిఫికేషన్స్ ఇవే :
Samsung Galaxy M33 5G కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల Full HD+ LCD డిస్‌ప్లేతో వస్తుంది. ఆండ్రాయిడ్ 12లో రన్ అవుతుంది. ప్రొప్రైటరీ Exynos 1280 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో హుడ్ కింద 6,000mAh బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ 50-MP ప్రైమరీ సెన్సార్, 5-MP అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్, 2-MP మాక్రో కెమెరా, 2-MP డెప్త్ సెన్సార్‌తో కూడిన క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను అందిస్తుంది. ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది.

Read Also : Samsung Galaxy M13 5G : శాంసంగ్ గెలాక్సీ M13 5G ఫీచర్లు లీక్.. త్వరలో ఇండియాకు..!