Rahul Gandhi: సాక్ష్యాధారాలతో నిరూపించగలరా? రాహుల్ గాంధీకి సావర్కర్ మనవడు సవాల్ ..

వీర్‌ సావర్కర్‌పై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలను సావర్కర్ మనువడు రంజిత్ సావర్కర్ తీవ్రంగా ఖండించారు. సావర్కర్ ఎప్పుడు బ్రిటిష్ వారికి క్షమాపణలు చెప్పారో సాక్ష్యాధారాలతో నిరూపించాలని రాహుల్ కు సవాల్ విసిరారు.

Rahul Gandhi: సాక్ష్యాధారాలతో నిరూపించగలరా? రాహుల్ గాంధీకి సావర్కర్ మనవడు సవాల్ ..

Rahul Gandhi

Rahul Gandhi: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) వీర్ సావర్కర్‌ (Veer Savarkar)ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రాహుల్ వ్యాఖ్యల పట్ల పలు పార్టీల నేతలు విమర్శలు చేస్తున్నారు. తాజాగా వీర్ సావర్కర్ మనవడు రంజిత్ సావర్కర్ (Ranjit Savarkar) రాహుల్ గాంధీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తాత గురించి రాహుల్ గాంధీ తప్పుగా మాట్లాడాడని, తన తాత సావర్కర్ పై చేసిన వ్యాఖ్యాలను రాహుల్ గాంధీ సాక్ష్యాలతో నిరూపించగలరా? అంటూ సవాల్ విసిరారు.

Uddhav Thackeray: సావర్కర్‌‌ను అవమానించొద్దు.. రాహుల్ గాంధీని హెచ్చరించిన ఉద్దవ్ ఠాక్రే

‘మోదీ’ అనే ఇంటిపేరును కించపర్చారన్న కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష పడిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని లోక్‌సభ సెక్రటేరియట్ రద్దు చేసింది. అనర్హత వేటుపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. సావర్కర్ పేరును ప్రస్తావించారు. క్షమాపణలు చెప్పడానికి నేను సావర్కర్ ను కాదు.. గాంధీని. గాంధీలు క్షమాపణలు చెప్పరు అంటూ వ్యాఖ్యానించారు. రాహుల్ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. శివసేన (యుబిటి) నాయకుడు ఉద్దవ్ ఠాక్రే (Uddhav Thackeray) రాహుల్ వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందించారు. వినాయక్ సావర్కర్‌ను అవమానించవద్దంటూ హెచ్చరికలు చేశారు. హిందుత్వ సిద్ధాంతకర్త సావర్కర్ ను తాను, తన ఆరాధ్యదైవంగా భావిస్తున్నానని, ఆయన్ను అవమానించడం మానుకోవాలని రాహుల్‌కు ఉద్దవ్ ఠాక్రే సూచించారు.

Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మరో షాక్.. ఇల్లు ఖాళీ చేయాలంటూ నోటీసులు

తాజాగా రాహుల్ వ్యాఖ్యలపై సావర్కర్ మనవడు రంజిత్ సావర్కర్ స్పందించారు. హిందుత్వ సిద్ధాంతకర్త అయిన సావర్కర్ ఎప్పుడు బ్రిటిష్ వారికి క్షమాపణలు చెప్పారో సాక్ష్యాధారాలతో నిరూపించాలని సవాల్ చేశారు. రాహుల్ వ్యాఖ్యలు పిల్లల మాటల్లా ఉన్నాయని, రాజకీయ ప్రచారం కోసం దేశభక్తుల పేర్లను వాడుకోవటం సరికాదంటూ రాహుల్‌ను దుయ్యబట్టారు. రాహుల్ సావర్కర్ పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని రంజిత్ ప్రభుత్వాన్నికోరారు.