Uddhav Thackeray: సావర్కర్‌‌ను అవమానించొద్దు.. రాహుల్ గాంధీని హెచ్చరించిన ఉద్దవ్ ఠాక్రే

రాహుల్ ‘సావర్కర్’ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై శివసేన (యుబిటి) నాయకుడు ఉద్దవ్ ఠాక్రే తీవ్రంగా స్పందించారు. వినాయక్ సావర్కర్ ను అవమానించవద్దంటూ రాహుల్ గాంధీకి హెచ్చరికలు చేశారు.

Uddhav Thackeray: సావర్కర్‌‌ను అవమానించొద్దు.. రాహుల్ గాంధీని హెచ్చరించిన ఉద్దవ్ ఠాక్రే

Uddhav Thackeray

Uddhav Thackeray: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)  లోక్‌సభ అభ్యర్థిత్వంపై అనర్హత వేటు పడిన విషయం విధితమే. పరువు నష్టం కేసు (Defamation case) లో గుజరాత్‌లోని సూరత్ కోర్టు రాహుల్‌కు రెండేండ్లపాటు జైలుశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఆ తరువాతి రోజే లోక్‌సభ సచివాలయం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. బెదిరింపులు, జైలు శిక్షలకు భయపడేది లేదని, ప్రశ్నించడం ఆపేది లేదని రాహుల్ అన్నారు. తానెప్పుడూ క్షమాపణలు చెప్పనని, నేను సావర్కర్ (Savarkar) కాదు.. నా పేరు గాంధీ. గాంధీ ఎవరినీ క్షమాపణలు అడగరు అంటూ రాహుల్ వ్యాఖ్యానించారు.

Priyanka Gandhi: నా తల్లిదండ్రులను, సోదరుడిని కించపర్చారు.. అయినప్పటికీ..: ప్రియాంకా గాంధీ

రాహుల్ ‘సావర్కర్’ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై శివసేన (యుబిటి) నాయకుడు ఉద్దవ్ ఠాక్రే  (Uddhav Thackeray)  తీవ్రంగా స్పందించారు. వినాయక్ సావర్కర్ ను అవమానించవద్దంటూ రాహుల్ గాంధీకి హెచ్చరికలు చేశారు. హిందుత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్ ను తాను, తన ఆరాధ్యదైవంగా భావిస్తున్నానని, ఆయన్ను అవమానించడం మానుకోవాలని రాహుల్ కు ఉద్దవ్ ఠాక్రే సూచించారు. అంతేకాదు, పదేపదే సావర్కర్ ను కించపర్చడం ద్వారా విపక్ష కూటమిలో విబేధాలు వస్తాయని, అది బీజేపీకి బలాన్ని చేకూర్చుతుందని అన్నారు.

Maharashtra: మరో పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ.. ఈసారి సెగ శివసేన నుంచి

సావర్కర్ 14ఏళ్లపాటు అండమాన్ సెల్యులార్ జైల్లో ఊహకందని చిత్రహింసలకు గురయ్యాడని, మనం బాధలను మాత్రమే చదవగలం. ఇది త్యాగం యొక్క రూపం. సావర్కర్‌ను అవమానిస్తే మేము సహించమని ఉద్దవ్ అన్నారు. ఉత్తర మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ముస్లింలు అధికంగా ఉండే పట్టణమైన మాలేగావ్‌లో ఆదివారం జరిగిన ర్యాలీలో ఠాక్రే పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీని ఉద్దశపూర్వకంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, రాహుల్ వారి ఉచ్చులో పడొద్దంటూ ఉద్దవ్ ఠాక్రే అన్నారు.