Chardam Vicinity Plastic : చార్‌దామ్ యాత్రలో ప్లాస్టిక్‌తో ముప్పు
ప్రస్తుతానికి చెత్తగా కనిపిస్తున్నా...రాబోయే రోజుల్లో ఆ ప్రాంతానికి ముప్పుగా మారనుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భక్తులు పారేస్తున్న చెత్తతో పర్యావరణ కాలుష్యంతో కొండచరియలు విరిగిపడటం వంటి ప్రకృతి వైఫరిత్యాలు సంభవిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

Chardam
Chardam Vicinity Plastic : చార్‌దామ్ పరిసరాల్లో భక్తులు ప్లాస్టిక్ పారేయడం జీవావరణానికి ముప్పు అని శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రతియేటా పెద్ద సంఖ్యలో భక్తులు ఉత్తరాఖండ్‌లోని చార్‌దామ్ యాత్రకు బయలుదేరుతారు. అయితే దేశం నలుమూల నుంచి వచ్చే వారు తమ వెంట తీసుకొస్తున్న ప్లాస్టిక్… జీవావరణానికి ముప్పుగా మారింది. అందమైన హిమాలయ ప్రాంతంలో చెత్త పేరుకుపోతోంది. దీంతో పర్యావరణం పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది.
ప్రస్తుతానికి చెత్తగా కనిపిస్తున్నా…రాబోయే రోజుల్లో ఆ ప్రాంతానికి ముప్పుగా మారనుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భక్తులు పారేస్తున్న చెత్తతో పర్యావరణ కాలుష్యంతో కొండచరియలు విరిగిపడటం వంటి ప్రకృతి వైఫరిత్యాలు సంభవిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు 2013లో జరిగిన విషాదాన్ని గుర్తు చేస్తున్నారు.
Uttarakhand Char Dham Yatra : చార్‌ధామ్ యాత్రలో విషాదం.. 12 రోజుల్లో 31 మంది మృతి
2013 జూన్‌లో ఉత్తరాఖండ్ అంతటా…వినాశకరమైన వరదలు సంభవించి అల్లకల్లోలం సృష్టించాయి. సరైన పారిశుద్ధ్య సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంతో చెత్త తొలగించడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని హై ఆల్టిట్యూడ్ ప్లాంట్ ఫిజియాలజీ శాస్త్రవేత్తలు అన్నారు. ఇది ఇలానే కొనసాగితే తీవ్రమైన ప్రమాదం చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరించారు.