seethakka: ఎమ్మెల్యే సీత‌క్క‌కు త‌ప్పిన ప్ర‌మాదం… వీడియో

ఎలిశెట్టిపల్లి వాగు వ‌ద్ద‌ ఆమె ప్రయాణిస్తున్న పడవ ఒక్క‌సారిగా చెట్టును ఢీకొంది. ఆ వెంట‌నే వాగు ప్ర‌వాహానికి ఆ పడవ ఒడ్డుకు కొట్టుకుపోయింది. ప‌డ‌వ‌లో ఉన్న సీతక్క ఎట్ట‌కేల‌కు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు.

seethakka: ఎమ్మెల్యే సీత‌క్క‌కు త‌ప్పిన ప్ర‌మాదం… వీడియో

Seethakka

seethakka: ములుగు జిల్లా ఏటూరునాగారంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కకు తృటిలో ప్రమాదం తప్పింది. తెలంగాణలోని ప‌లు జిల్లాల్లో కురిసిన భారీ వ‌ర్షాల‌కు ప‌లు గ్రామాల్లో భారీగా నీరు నిలిచిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఏటూరునాగారంలో ముంపు ప్రాంతాల్లో పర్యటించి ప్ర‌జ‌ల‌కు సాయం చేసేందుకు సీత‌క్క వెళ్ళారు. ఆ స‌మ‌యంలో ఎలిశెట్టిపల్లి వాగు వ‌ద్ద‌ ఆమె ప్రయాణిస్తున్న పడవ ఒక్క‌సారిగా చెట్టును ఢీకొంది. ఆ వెంట‌నే వాగు ప్ర‌వాహానికి ఆ పడవ ఒడ్డుకు కొట్టుకుపోయింది. ప‌డ‌వ‌లో ఉన్న సీతక్క ఎట్ట‌కేల‌కు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. దీంతో అంద‌రూ ఊపిరిపీల్చుకున్నారు.

Maharashtra: ఔరంగాబాద్, ఉస్మానాబాద్ పేర్ల మార్పు.. ‘మ‌హా’ కేబినెట్ కీల‌క‌ నిర్ణయాలు

అనంతరం ఆమె తన పర్యటనను కొనసాగించారు. కాగా, ప‌లువురు కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి ముంపు ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు సీత‌క్క‌ నిత్యావసరాలు పంపిణీ చేశారు. అక్క‌డి ప్ర‌జ‌లతో మాట్లాడి వారు ప‌డుతున్న ఇబ్బందుల గురించి తెలుసుకున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. కాగా, కొన్ని రోజులుగా ఆమె ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలను నిత్యావసరాలు అందిస్తున్నారు.