Maharashtra Politics: ఎన్సీపీ సీనియర్ నేత రాజీనామా.. ఆయన వెంటే బేరర్లంతా రాజీనామా

అధ్యక్ష పదవి రేసులో ప్రధానంగా ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నరు. ఒకరు శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే కాగా, మరొకరు ఆయన అన్న కొడుకు అజిత్ పవార్. ఇక వీరిద్దరే కాకుండా ఎన్సీపీ మహారాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ సైతం రేసులో కనిపిస్తున్నారు

Maharashtra Politics: ఎన్సీపీ సీనియర్ నేత రాజీనామా.. ఆయన వెంటే బేరర్లంతా రాజీనామా

Updated On : May 3, 2023 / 6:35 PM IST

Maharashtra Politics: శరద్ పవార్ రాజీనామా ప్రకటనతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో లేచిన దుమారం మరింత తీవ్రమవుతోంది. తాజాగా పార్టీ సీనియర్ నేత ఒకరు రాజీనామా చేశారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే అయిన జితేంద్ర అవధ్ బుధవారం పార్టీలోని తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం రాజీనామా లేఖను పవార్‭కు పంపారు. ఈ విషయాన్ని ఆయన ట్వీట్‌ ద్వారా తెలియజేశారు. ఆ ట్వీటులో ”పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశాను. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌కు రాజీనామా పత్రాన్ని పంపాను. పవార్ రాజీనామా ప్రకటించగానే థానే ఎన్సీపీ ఆఫీసు బేరర్లందరూ కూడా రాజీనామా చేశారు” అని జింతేంద్ర అవధ్ ట్వీట్‌ చేశారు.

Karnataka elections 2023: కిరీటం వంటి తలపాగాను ధరించిన ప్రధాని మోదీ.. ప్రత్యేకత ఏంటీ?

కాగా, ఎన్‌సీపీ చీఫ్ పదవికి రాజీనామా చేయడంలో ఎన్‌సీపీ సీనియర్ నేతలు బుధవారంనాడు ముంబైలో కీలక సమావేశం నిర్వహించారు. శరద్ పవార్‌తో పాటు అజిత్ పవార్, సుప్రియా సులే, ప్రఫుల్ పటేల్, ఇతర ఎన్సీపీ నేతలు ఇందులో పాల్గొన్నారు. ఇక ఇదిలా ఉంటే.. పార్టీకి నూతన అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు 15 మంది సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు అయింది. ఈ కమిటీయే కాబోయే అధ్యక్షుడిని నిర్ణయిస్తుందని పవార్ ప్రకటించారు. అయితే ఈ కమిటీ పవార్ కనుసన్నల్లోనే పని చేస్తుంది కాబట్టి.. పవార్ కోరుకున్న వ్యక్తే తదుపరి అధ్యక్షుడు అవుతారనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే పవార్ ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది అసలు ప్రశ్న.

Pakistan: ప్రభుత్వానికి విపక్షానికి మధ్య కుదిరిన ఒప్పందం.. తొందరలో ఎన్నికలు!

అయితే అధ్యక్ష పదవి రేసులో ప్రధానంగా ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నరు. ఒకరు శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే కాగా, మరొకరు ఆయన అన్న కొడుకు అజిత్ పవార్. ఇక వీరిద్దరితో పాటు ఎన్సీపీ మహారాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ సైతం రేసులో కనిపిస్తున్నారు. ఇక వీరే కాకుండా ప్రఫుల్ పటేల్, సునీల్ తడ్కరే, కేకే శర్మ, పీసీ చాకో, ఛగన్ భుజ్‌బల్, దిలీప్ పాటిల్, అనిల్ దేశ్‌ముఖ్, రాజేష్ తోపే, జితేంద్ర అహ్వాద్, హసన్ ముష్రిఫ్, ధనంజయ్ ముండే, జయదేవ్ గైక్‌వాడ్ వంటి పేర్లు సైతం ఈ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.