Shahrukh Khan : పఠాన్ సక్సెస్ తర్వాత ఫ్యాన్స్‌కి అభివాదం చేసిన షారుఖ్.. జనసంద్రమైన మన్నత్ రోడ్..
తాజాగా పఠాన్ సినిమా రిలీజయి సక్సెస్ అయిన తర్వాత ఆదివారం నాడు భారీగా అభిమానులు షారుఖ్ ఇంటివద్దకు చేరుకోవడంతో మరోసారి షారుఖ్ ఖాన్ ఆదివారం సాయంత్రం తన ఇంట్లో నుండి అభిమానులకి కనిపించి..................

Shahrukh Khan greets his fans from his house mannat on sunday evening
Shahrukh Khan : షారుఖ్ ఖాన్, దీపికా జంటగా జాన్ అబ్రహం విలన్ గా సిద్దార్థ్ ఆనంద దర్శకత్వంలో తెరకెక్కిన పఠాన్ సినిమా జనవరి 25న రిలీజయి మంచి విజయం సాధించింది. షారుఖ్ నాలుగేళ్ల గ్యాప్ తర్వాత యాక్షన్ సినిమాతో థియేటర్స్ లోకి రావడంతో అభిమానులు, ప్రేక్షకులు సందడి చేస్తున్నారు. పఠాన్ సినిమా భారీగా కలెక్షన్స్ కూడా వసూలు చేస్తుంది. పఠాన్ సినిమా నాలుగు రోజుల్లోనే 429 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అంటే దాదాపు 212 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త రికార్డులని క్రియేట్ చేసింది.
ముంబైలో షారుఖ్ ఇల్లు మన్నత్ కూడా ఓ సందర్శన ప్రదేశమే. షారుఖ్ అభినానులు ప్రతి ముఖ్యమైన రోజుల్లో, సినిమా రిలీజ్ సమయాల్లో షారుఖ్ ఇంటి వద్దకి వచ్చి సందడి చేస్తారు. షారుఖ్ ఇంటివద్ద ఎప్పుడు చూసినా జనాలు కనిపిస్తూనే ఉంటారు. అక్కడికి వచ్చే జనాల కోసం షారుఖ్ లోపలి నుంచే స్టెప్స్ పైకెక్కి అందరికి అభివాదం చేస్తాడు. ఇంటి లోపలి నుంచే అభిమానులకి అభివాదం చేయడానికి ప్రతిసారీ ఒక ప్లేస్ ని ఎత్తులో కట్టించాడు. చివరగా షారుఖ్ పుట్టిన రోజు నాడు అక్కడినుంచి అభిమానులకి అభివాదం చేశాడు.
తాజాగా పఠాన్ సినిమా రిలీజయి సక్సెస్ అయిన తర్వాత ఆదివారం నాడు భారీగా అభిమానులు షారుఖ్ ఇంటివద్దకు చేరుకోవడంతో మరోసారి షారుఖ్ ఖాన్ ఆదివారం సాయంత్రం తన ఇంట్లో నుండి అభిమానులకి కనిపించి అభివాదం చేశాడు. దీంతో మన్నత్ రోడ్ మొత్తం జనసంద్రోహంగా మారింది. ఆదివారం కావడంతో జనాలు విపరీతంగా వచ్చారు. షారుఖ్ వచ్చి వెళ్ళాక పోలీసులు జనాల్ని పంపించేశారు. అభిమానులకి షారుఖ్ తన ఇంటివద్దనుండి అభివాదం చేసిన ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.
Mehmaan Nawaazi Pathaan ke ghar par… Thank u all my Mehmaans for making my Sunday so full of love. Grateful. Happy. Loved. pic.twitter.com/ivfpK07Vus
— Shah Rukh Khan (@iamsrk) January 29, 2023