Adipurush: ‘ఆదిపురుష్’కు డబ్బింగ్ మొదలుపెట్టిన శరద్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదిపురుష్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తుండగా, రామాయణం ఆధారంగా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందించింది. ఇక ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా, సీత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది.

Adipurush: ‘ఆదిపురుష్’కు డబ్బింగ్ మొదలుపెట్టిన శరద్!

Adipurush: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదిపురుష్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తుండగా, రామాయణం ఆధారంగా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందించింది. ఇక ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా, సీత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది.

Adipurush : ఆదిపురుష్ పై మాట్లాడిన కృతి.. సినిమాలో చెప్పాల్సింది చాలా ఉంది.. మీరు చూసింది టీజర్ మాత్రమే..

కాగా, ఈ సినిమాను జనవరిలో రిలీజ్ చేస్తామని తొలుత చెప్పిన చిత్ర యూనిట్, పలు కారణాల వల్ల తమ సినిమా రిలీజ్ ను వాయిదా వేసింది. అయితే, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆదిపురుష్ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనులు స్టార్ట్ అయ్యాయని, ప్రభాస్ పాత్రకు తాను డబ్బింగ్ స్టార్ట్ చేసినట్లుగా శరద్ కేల్కర్ వెల్లడించారు. ప్రభాస్ సినిమాలకు హిందీలో శరద్ కేల్కర్ ఎక్కువగా డబ్బింగ్ చెబుతుంటాడు.

Adipurush: ఆదిపురుష్ వాయిదా ఎఫెక్ట్.. మరో వంద కోట్లకు టెండర్..?

ఇప్పుడు రాముడి పాత్రలో నటిస్తున్న ప్రభాస్ కు మరోసారి డబ్బింగ్ చెప్పడం సంతోషంగా ఉందని శరద్ కేల్కర్ తెలిపారు. ఇక ఈ సినిమాలో లంకేశుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. మరి ఆదిపురుష్ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.