Adipurush: ఆదిపురుష్ వాయిదా ఎఫెక్ట్.. మరో వంద కోట్లకు టెండర్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదిపురుష్’ టీజర్‌ను దసరా సందర్భంగా రిలీజ్ చేయగా, దానికి నెగెటివ్ రెస్పాన్స్ ఎక్కువగా వచ్చింది. దీంతో ఈ సినిమా ఔట్‌పుట్ విషయంలో చిత్ర యూనిట్ మరింత వర్కవుట్ చేసేందుకు సమయం తీసుకోనుండటంతో, ఈ సినిమాను ముందుగా ప్రకటించినట్లుగా జనవరి 12న రిలీజ్ చేయడం లేదని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది.

Adipurush: ఆదిపురుష్ వాయిదా ఎఫెక్ట్.. మరో వంద కోట్లకు టెండర్..?

Adipurush Postponement To Cost More Rs 100 Cr Budget

Adipurush: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదిపురుష్’ టీజర్‌ను దసరా సందర్భంగా రిలీజ్ చేయగా, దానికి నెగెటివ్ రెస్పాన్స్ ఎక్కువగా వచ్చింది. దీంతో ఈ సినిమా ఔట్‌పుట్ విషయంలో చిత్ర యూనిట్ మరింత వర్కవుట్ చేసేందుకు సమయం తీసుకోనుండటంతో, ఈ సినిమాను ముందుగా ప్రకటించినట్లుగా జనవరి 12న రిలీజ్ చేయడం లేదని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఆదిపురుష్ సినిమాను ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుపెట్టుకునేలా తీర్చిదిద్దేందుకు తాము మరికొంత సమయం తీసుకుంటున్నట్లుగా చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.

Adipurush : అనుకున్నదే అయిందిగా.. వాయిదాపడిన ఆదిపురుష్.. ఏకంగా జూన్‌కి..

అంతేగాక, ఈ సినిమాను వచ్చే ఏడాది జూన్ 16న రిలీజ్ చేస్తామని రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమా వాయిదా పడటంతో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఇప్పటికే ఆదిపురుష్ సినిమా పులమార్లు వాయిదా పడుతూ వచ్చిందని.. ఇప్పుడు మళ్లీ వాయిదా పడటంతో తమ అభిమాన హీరో సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని వారు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా వాయిదా పడటంతో ఇప్పుడు సినిమా బడ్జెట్ విషయంలోనూ భారీగా ప్రభావం చూపనుందని తెలుస్తోంది.

Adipurush: సంక్రాంతి వద్దనుకున్న ఆదిపురుష్.. అయినా ఇబ్బంది తప్పట్లేదుగా!

ఈ సినిమాకు సంబంధించిన వీఎఫ్ఎక్స్ పనులను తిరిగి పర్ఫెక్ట్‌గా చేయనుండటంతో ఈ సినిమాకు కేటాయించిన బడ్జెట్ మరో వంద కోట్లు పెరుగుతున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అయినా కూడా నిర్మాతలు ఏమాత్రం వెనకడుగు వేయకుండా, ప్రేక్షకులకు అదిరిపోయే ఫీస్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారట. ఏదేమైనా ఆదిపురుష్ వాయిదా వల్ల నిర్మాతలకు మరో వంద కోట్లు అదనంగా భరించాల్సి వస్తుండటంతో, ఇప్పుడు ఈ సినిమా టార్గెట్ మరింతగా పెరిగిపోనుందని సినీ వర్గాలు అంటున్నాయి. మరి ఈ సినిమా రిలీజ్ అయ్యేనాటికి ‘ఆదిపురుష్’ టోటల్ బడ్జెట్ ఎంతవరకు వెళ్తుందో చూడాలి.