Siddanth Kapoor : బాలీవుడ్‌లో మళ్ళీ డ్రగ్స్ కలకలం.. అడ్డంగా దొరికిపోయిన శ్రద్దాకపూర్ సోదరుడు సిద్దాంత్‌ అరెస్ట్..

గత కొన్నేళ్లుగా డ్రగ్స్ కేసులు బాలీవుడ్ ని భయపెడుతూనే ఉన్నాయి. ఒకటి అయిపోతే ఇంకోటి అన్నట్టు ఒకరి తర్వాత ఒకరు ఎవరో ఒకరు డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కుంటున్నారు. సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్ లో..............

Siddanth Kapoor : బాలీవుడ్‌లో మళ్ళీ డ్రగ్స్ కలకలం.. అడ్డంగా దొరికిపోయిన శ్రద్దాకపూర్ సోదరుడు సిద్దాంత్‌ అరెస్ట్..

Siddanth Kapoor

Updated On : June 13, 2022 / 11:34 AM IST

Bollywood :  గత కొన్నేళ్లుగా డ్రగ్స్ కేసులు బాలీవుడ్ ని భయపెడుతూనే ఉన్నాయి. ఒకటి అయిపోతే ఇంకోటి అన్నట్టు ఒకరి తర్వాత ఒకరు ఎవరో ఒకరు డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కుంటున్నారు. సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్ లో డ్రగ్స్ కేసులు ఎక్కువయ్యాయి. పలువురు బాలీవుడ్ నటీనటులు కూడా అరెస్ట్ అయ్యారు. ఇక ఇటీవల షారుఖ్ కొడుకు కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి జైలుకి వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరో బాలీవుడ్ నటుడు డ్రగ్స్ కేసులో అడ్డంగా దొరికిపోయాడు.

ఆదివారం రాత్రి బెంగళూరులో ఓ హోటల్‌లో రేవ్ పార్టీ జరుగుతున్నట్టు పోలీసులకి సమాచారం వచ్చింది. దీంతో పక్కా సమాచారంతో బెంగళూరు పోలీసులు పార్టీ నిర్వహిస్తున్న ఎంజీ రోడ్డులోని ఓ హోటల్‌పై దాడి చేశారు. ఈ దాడిలో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్‌ తీసుకున్నట్టు అనుమానిస్తున్న వారి రక్త నమూనాలను పరీక్షలకు పంపగా ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. ఈ ఆరుగురిలో ప్రముఖ బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ సోదరుడు, నటుడు సిద్దాంత్ కపూర్ కూడా ఉన్నాడు.

Saipallavi : విరాటపర్వం ఆత్మీయ వేడుకలో సాయిపల్లవి

దీంతో సిద్దాంత్ తో పాటు మిగిలిన అయిదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఆరుగురు వ్యక్తులు హోటల్‌లో డ్రగ్స్ సేవించారా లేదా పార్టీకి వచ్చే ముందు తీసుకున్నారా అనేది ఇంకా తెలియలేదు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఇక, సిద్దాంత్.. షూటౌట్ ఎట్ వదాలా, హసీనా పార్కర్, చెహ్రే వంటి పలు బాలీవుడ్ సినిమాలు, సిరీస్ లలో నటించాడు. పలు పెద్ద సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేశాడు. సిద్దాంత్ డ్రగ్స్ తీసుకొని అరెస్ట్ అవ్వడంతో మరోసారి బాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం రేగింది.