DJ Tillu: సిద్దూ డీజే రచ్చ.. ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?

ఒకపక్క థియేటర్లలో కొత్త సినిమాలు.. స్టార్ హీరోల సినిమాల సందడి మొదలవగా.. ఇప్పటికే థియేటర్లలో వచ్చేసి రెండు వారాలు గడవడంతో వాటిపై ఓటీటీలు స్పెషల్ ఫోకస్ పెట్టేసి సాధ్యమైనంత త్వరగా..

DJ Tillu: సిద్దూ డీజే రచ్చ.. ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?

Dj Tillu

DJ Tillu: ఒకపక్క థియేటర్లలో కొత్త సినిమాలు.. స్టార్ హీరోల సినిమాల సందడి మొదలవగా.. ఇప్పటికే థియేటర్లలో వచ్చేసి రెండు వారాలు గడవడంతో వాటిపై ఓటీటీలు స్పెషల్ ఫోకస్ పెట్టేసి సాధ్యమైనంత త్వరగా ఓటీటీలో తీసుకొచ్చేసి క్యాష్ చేసుకొనే పనిలో ఉన్నాయి. ఫిబ్రవరి రెండో వారంలో మాస్ రాజా రవితేజ ఖిలాడీ, సిద్ధూ డీజే టిల్లు, సెహరీ సినిమాలు థియేటర్లలో విడుదలవగా వాటిలో డీజే టిల్లు సినిమాగా రిలీజై భారీ బ్లాక్ బస్టర్ హిట్టు దక్కించుకున్న సంగతి తెలిసిందే.

DJ Tillu: థియేటర్లలో డీజే రీసౌండ్.. కలెక్షన్ల మోతమోగిస్తున్న టిల్లు

డీజే టిల్లు కామెడీకి యూత్ బాగా కనెక్ట్ కావడం,. సిద్ధూ మేనరిజమ్స్.. అర్బన్ లాంగ్వేజ్ యూత్ కి బాగా కనెక్ట్ అవడంతో థియేటర్లలో ఈ సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకుంది. ఓవర్సీస్ లో కూడా టిల్లు హవా గట్టిగానే కనిపించగా.. ఫైనల్ గా జాతిరత్నాలు తర్వాత టిల్లు గాడు హిలేరియస్ కామెడీతోనే సక్సెస్ అయిపోయి.. ఆ వారం సినిమాలలో ఫైనల్ గా టిల్లు గాడే తోపు అయ్యాడు.

Khiladi-DJ Tillu: మాస్ రాజా రొటీన్ కంటెంట్ VS టిల్లు గాడి హిలేరియస్!

కాగా ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో కూడా వచ్చేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తుంది. సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం చూస్తే.. డీజే టిల్లు మార్చి 10 నుంచి అచ్చ తెలుగు ఓటీటీ ఆహాలో ప్రసారమయ్యే అవకాశముందని తెలుస్తోంది. అదే నిజమైతే మార్చిలో బడా హీరోల సినిమాలుండగా టిల్లు గాడు ఓటీటీలో ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాల్సి ఉంది.