Sirivennela : సిరివెన్నెలకు, త్రివిక్రమ్‌కు మధ్య బంధుత్వం ఏంటో తెలుసా?

త్రివిక్రమ్ మాటలతోను, ఆయన వ్యక్తిత్వంతోనూ పరిశ్రమలో అందరికి దగ్గరయ్యారు. ఈ క్రమంలో సిరివెన్నెలకి త్రివిక్రమ్ బాగా నచ్చేశారు. త్రివిక్రమ్ వ్యక్తిత్వం కూడా బాగుండటంతో ఆయన్ని......

Sirivennela :  సిరివెన్నెలకు, త్రివిక్రమ్‌కు మధ్య బంధుత్వం ఏంటో తెలుసా?

Sirivennela Trivikram

Sirivennela :  త్రివిక్రమ్, సిరివెన్నెల ఇద్దరూ తెలుగు సినిమా కోసం కలం పట్టినవారే. ఒకరు పాటతో, మరొకరు మాటతో మన మనసుల్ని కదిలించారు. సిరివెన్నెల మరణంతో ఒక్కసారిగా తెలుగు సినీ పరిశ్రమ మూగబోయింది. ఆయన గురించి, ఆయన జీవితం, పాటల గురించి తెలుసుకోవాలని అంతా ఆరాటపడుతున్నారు. ఈ క్ర‌మంలోనే సిరివెన్నెల సీతారామ‌శాస్త్రిపై గ‌తంలో మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు వైర‌ల్‌గా మారాయి. అప్పట్లోనే ఆ స్పీచ్ బాగా వైరల్ అయింది. ఆ స్పీచ్ తో సిరివెన్నలని ఆకాశానికెత్తేశారు త్రివిక్రమ్. ఇక సిరివెన్నెల మరణం తర్వాత త్రివిక్రమ్ దగ్గరుండి ఆయన కార్యక్రమానికి అన్ని పనులు చూసుకుంటున్నాడు. ఈ నేప‌థ్యంలో త్రివిక్ర‌మ్‌, సిరివెన్నెల మ‌ధ్య ఉన్న రిలేష‌న్ ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నారు.

Sirivennela : ‘సిరివెన్నెల’ నటించిన ఒకేఒక్క సినిమా ఏంటో తెలుసా?… అది కూడా ఆర్జీవీ దర్శకత్వంలో

త్రివిక్రమ్ మాటలతోను, ఆయన వ్యక్తిత్వంతోనూ పరిశ్రమలో అందరికి దగ్గరయ్యారు. ఈ క్రమంలో సిరివెన్నెలకి త్రివిక్రమ్ బాగా నచ్చేశారు. త్రివిక్రమ్ వ్యక్తిత్వం కూడా బాగుండటంతో ఆయన్ని మరింత దగ్గరివాడ్ని చేసుకోవాలనుకున్నారు సిరివెన్నెల. దీంతో సిరివెన్నెల సోద‌రుడి కుమార్తె సౌజ‌న్య‌తో త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కి వివాహం జరిపించారు. ఈ వివాహానికి సిరివెన్నెల పెళ్లి పెద్దగా వ్యవహరించారు. ఈ లెక్కన త్రివిక్రమ్ శ్రీనివాస్ సిరివెన్నెల సీతారామశాస్త్రికి అల్లుడు అవుతాడు. ఈ వివాహం త‌ర్వాత సిరివెన్నెల‌, త్రివిక్ర‌మ్ మ‌ధ్య బంధం ఇంకా బ‌ల‌ప‌డింది. త్రివిక్రమ్ సిరివెన్నెలను తన గురువుగా భావిస్తారు. ఇక ఆయన మరణంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ శోకసంద్రంలో మునిగిపోయారు.