HIT 2: అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్ములేపుతున్న హిట్-2

తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న థ్రిల్లింగ్ మూవీ హిట్-2 మరికొన్ని గంటల్లోనే రిలీజ్ కానుంది. దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న హిట్ వర్స్ నుండి వస్తున్న రెండో మూవీగా హిట్-2 ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది.

HIT 2: అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్ములేపుతున్న హిట్-2

Solid Numbers In For HIT 2 Advance Bookings

HIT 2: తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న థ్రిల్లింగ్ మూవీ హిట్-2 మరికొన్ని గంటల్లోనే రిలీజ్ కానుంది. దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న హిట్ వర్స్ నుండి వస్తున్న రెండో మూవీగా హిట్-2 ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా టీజర్, ట్రైలర్లు ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించాయి. దీంతో ఈ సినిమాను ఫస్ట్‌డే ఫస్ట్ షో చూసేందుకు అభిమానులు ఎంతో ఆతృతగా ఉన్నారు.

HIT 2: అడివి శేష్ నటిస్తున్న ‘హిట్-2’ టార్గెట్ ఎంతో తెలుసా..?

అడివి శేష్ హీరోగా నటిస్తున్న హిట్-2 మూవీ ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో చేయడంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కిన హిట్-2 మూవీలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల ఊహకు అందని విధంగా ఉంటాయని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్‌గా చెబుతోంది. ఇక ఈ సినిమాలో అడివి శేష్ పాత్ర కూడా నెక్ట్స్ లెవెల్‌లో ఉంటుందని, ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయమని చిత్ర యూనిట్ పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకుంటూ వస్తోంది.

HIT 2: అడివి శేష్‌కి ‘హిట్’ ఇచ్చేందుకు వస్తున్న జక్కన్న!

ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు కూడా పెద్ద ఎత్తున అడ్వాన్స్ బుకింగ్స్ చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ ఐమ్యాక్స్‌లోని బిగ్‌స్క్రీన్స్‌తో సహా ఆరు స్క్రీన్స్‌లో కూడా హిట్-2 సినిమాను ప్రదర్శిస్తున్నారు. ఇక మార్నింగ్ షోతో పాటు అన్ని షోలు కూడా హౌజ్‌ఫుల్ కావడంతో సినీ వర్గాలు ఆశ్చర్యానికి గురవుతున్నాయి. అటు ఓవర్సీస్‌లోనూ ప్రీమియర్ షోలకు ట్రెమెండస్ రెస్పాన్స్ దక్కుతుందని చిత్ర యూనిట్ తెలిపింది. మొత్తానికి హిట్-2 మూవీ తొలిరోజునే భారీ వసూళ్లపై కన్నేసిందని దీన్నిబట్టి అర్థమవుతోంది. మరి ఈ సినిమాకు ఫస్ట్ డే ఎంతమేర వసూళ్లు వస్తాయో, ఈ సినిమాకు ప్రేక్షకులు ఎలాంటి రెస్పాన్స్‌ను ఇస్తారో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.