HIT 2: అడివి శేష్ నటిస్తున్న ‘హిట్-2’ టార్గెట్ ఎంతో తెలుసా..?

టాలీవుడ్‌లో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ‘హిట్-2’ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో ఎలాంటి క్రేజ్ నెలకొందో అందరికీ తెలిసిందే. యంగ్ హీరో అడివి శేష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తుండగా, నేచురల్ స్టార్ నాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇక డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా మంచి అంచనాల మధ్య ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

HIT 2: అడివి శేష్ నటిస్తున్న ‘హిట్-2’ టార్గెట్ ఎంతో తెలుసా..?

HIT 2 Has To Collect This Much For Break Even

HIT 2: టాలీవుడ్‌లో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ‘హిట్-2’ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో ఎలాంటి క్రేజ్ నెలకొందో అందరికీ తెలిసిందే. యంగ్ హీరో అడివి శేష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తుండగా, నేచురల్ స్టార్ నాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇక డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా మంచి అంచనాల మధ్య ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

HIT 2: అడివి శేష్‌కి ‘హిట్’ ఇచ్చేందుకు వస్తున్న జక్కన్న!

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌ను చిత్ర యూనిట్ నిర్వహించగా, ఈ ఈవేంట్‌కు ముఖ్య అతిథిగా స్టార్ డైరెక్టర్ రాజమౌళి హాజరయ్యారు. ఆయన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని చిత్ర యూనిట్‌ను అభినందించాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్లు ఇప్పటికే ప్రేక్షకుల్లో ఈ సినిమాపై క్యూరియాసిటీని ఓ రేంజ్‌లో క్రియేట్ చేశాయి. అయితే ఈ సినిమాకున్న క్రేజ్ కారణంగా హిట్-2 మూవీ అదిరిపోయే ప్రీరిలీజ్ బిజినెస్ చేసినట్లుగా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

HIT 2: సెన్సార్ పనులు ముగించుకున్న హిట్-2.. రన్‌టైమ్ ఎంతంటే?

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.14.50 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ జరపగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఏకంగా రూ.10 కోట్ల మేర వసూళ్లు సాధిస్తేనే బ్రేక్ ఈవెన్‌కు చేరుకుంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అడివి శేష్ కెరీర్‌లోనే ఇది అత్యంత హయ్యెస్ట్ ప్రీరిలీజ్ బిజినెస్ అని చెప్పాలి. మీనాక్షి చౌదరి, రావు రమేష్, ఆదర్శ్ బాలకృష్ణ, తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.