Sonu Sood : మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సెట్స్‌కు సైకిల్‌పై వెళ్లిన సోనూ సూద్!..

సోనూ సూద్.. పరిచయం అక్కర్లేని పేరు ఇది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల మనసుల్లో ముద్రపడిపోయిన పేరు. కరోనా మహమ్మారి కాటేసిన వేళలో వేలాది మంది దిక్కుతోచక రోడ్ల మీద కాలినడకన స్వస్థలాలకు వెళుతుంటే.. వారిని స్వచ్ఛందంగా ఆదుకున్న సోనూ సూద్ సహాయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది..

Sonu Sood : మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సెట్స్‌కు సైకిల్‌పై వెళ్లిన సోనూ సూద్!..

Sonu Sood

Updated On : April 14, 2021 / 5:02 PM IST

Sonu Sood: సోనూ సూద్.. పరిచయం అక్కర్లేని పేరు ఇది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల మనసుల్లో ముద్రపడిపోయిన పేరు. కరోనా మహమ్మారి కాటేసిన వేళలో వేలాది మంది దిక్కుతోచక రోడ్ల మీద కాలినడకన స్వస్థలాలకు వెళుతుంటే.. వారిని స్వచ్ఛందంగా ఆదుకున్న సోనూ సూద్ సహాయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

Acharya

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆచార్య’ లో సోనూ సూద్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ లొకేషన్‌కు సోనూ సైకిల్ మీద వెళ్లడం విశేషం.

Sonu Sood

సోనూ సూద్‌కి సైక్లింగ్ అంటే చాలా ఇష్టం.. పైగా, ఉద‌యాన్నే సెట్‌కి వెళ్లాల్సిన అవ‌స‌రం వ‌చ్చింది. అందుకే సైకిల్ ఎక్కారు. ఈ రకంగా ఆయనకు అటు వ్యాయామం, ఇటు ప్ర‌యాణం రెండూ క‌లిసొచ్చేశాయన్నమాట.. ఈ సినిమాలో చిరు సరసన కాజల్ అగర్వాల్, చరణ్ పక్కన పూజా హెగ్డే కథానాయికలుగా నటిస్తున్నారు..