South Star’s: రారమ్మని ఊరిస్తున్న బాలీవుడ్.. సౌత్ స్టార్స్ ఆరాటం!

గతంలో సౌత్ హీరోస్ చాలామందే బాలీవుడ్ లో వాళ్ల లక్ చేసుకున్నారు. కానీ అందులో రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి వాళ్లు కాస్త సస్టైన్ అవగలిగారు. కానీ ఇప్పుడు కథ వేరు.. మన హీరోలకు అక్కడ..

South Star’s: రారమ్మని ఊరిస్తున్న బాలీవుడ్.. సౌత్ స్టార్స్ ఆరాటం!
ad

South Star’s: గతంలో సౌత్ హీరోస్ చాలామందే బాలీవుడ్ లో వాళ్ల లక్ చేసుకున్నారు. కానీ అందులో రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి వాళ్లు కాస్త సస్టైన్ అవగలిగారు. కానీ ఇప్పుడు కథ వేరు.. మన హీరోలకు అక్కడ డిమాండ్ పెరిగింది. దీంతో త్వరలో మరికొందరు స్టార్స్ కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.

Sukumar-Vijay: లెక్కల మాస్టారితో రౌడీబాయ్.. వీర సైనికుడి విధ్వంసమే!

మొన్నటివరకు సౌత్ హీరోయిన్స్ అంటే ముద్దు కానీ అక్కడి హీరోలు వద్దనేవారు బాలీవుడ్ మేకర్స్. కానీ డామిట్ కథ అడ్డం తిరిగిందిప్పుడు. సౌత్ యాక్టర్స్ కి బాలీవుడ్ వెల్కమ్ చెబుతుంది. వీళ్ల మార్కెట్ చూసి అవాక్కవుతుంది. బాహుబలితో రేంజ్ పెరిగిన తర్వాత సాహోతో డైరెక్ట్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు ప్రభాస్. అక్కడ 145 కోట్లు రాబట్టి సత్తా చాటారు.

RRR: ఆర్ఆర్ఆర్ వాయిదా పడినా బాధలేదు.. చెర్రీ భావోద్వేగం!

మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ జోయా ఫ్యాక్టర్, కార్వాన్ సినిమాలతో డైరెక్ట్ బాలీవుడ్ సినిమాల్లో నటించాడు. పెద్దగా వర్కవుట్ కాలేదు కానీ ఓటీటీలో సూపర్ హిట్ అనిపించుకున్నాయి. అందుకే దుల్కర్ నెక్ట్స్ సినిమాలన్నీ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతున్నాయి. ఇక చాలా కాలం కిందటే రాంజనాతో ధనుష్ డైరెక్ట్ నార్త్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత షమితాబ్ చేశాడు. రీసెంట్ ఓటీటీ రిలీజ్ అత్రాంగి రేతో మంచి మార్కులు కొట్టేసాడు. సో ఇప్పుడు వరుస సినిమాలతో నార్త్ లో కనిపిస్తూ మార్కెట్ పెంచుకోవాలనేది ధనుష్ ప్లాన్.

Arjun-Malaika: అర్జున్-మలైకా బ్రేకప్.. ఏంటి హాట్ కపుల్ విడిపోతున్నారా?

కరణ్ జోహార్ నిర్మాణంలో బాలీవుడ్ ఎంట్రీ గ్రాండ్ గా ఇస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఇప్పటికే కబీర్ సింగ్ ఒరిజినల్ హీరోగా అర్జున్ రెడ్డి ఫేం ఉంది విజయ్ కి. సో ఇప్పుడు లైగర్ తో ఆ ఫేంను సూపర్ స్టార్ డం గా మార్చాలనేది రౌడీబాయ్ ఆలోచన. బాలీవుడ్ హీరోయిన్స్, మేకర్స్.. విజయ్ దేవరకొండతో పనిచేయాలనుందని డైరెక్ట్ గానే చెప్పేస్తున్నారు. సో లైగర్ తర్వాత రౌడీబాయ్ ఇమేజ్.. అమాంతం పెరగడం ఖాయంగా కనిపిస్తుంది.

BBB: బాలయ్య-బోయపాటి-బన్నీ మల్టీస్టారర్.. రచ్చ రచ్చేనా?

పుష్ప డబ్బింగ్ వర్షన్ తో ఎవ్వరూ ఊహించని స్టామినా చూపించారు ఐకాన్ స్టార్. కరణ్ జోహార్, అర్జున్ కపూర్, జాన్వీతో పాటూ చాలామంది బాలీవుడ్ స్టార్స్ ఇప్పుడు బన్నీని పొగిడే పనిలోనే ఉన్నారు. ఇప్పటికే కొందరు బాలీవుడ్ దర్శకనిర్మాతలు అల్లు అర్జున్ టచ్ లోకి వచ్చినట్టు తెలుస్తోంది. చూస్తుంటే డైరెక్ట్ బాలీవుడ్ ఎంట్రీతో బన్నీ కిక్కించేలా ఉన్నారు.

Chiru 154: చిరుకి తమ్ముడిగా మాస్ రాజా.. బర్త్ డే రోజు ప్రకటన!

మిన్నాల్ మురళీతో ఫుల్ హైప్ క్రియేట్ చేశాడు టోవినో థామస్. నెట్ ప్లిక్స్ లో అన్ని భాషల్లో రిలీజై మిన్నాల్ మురళీ సూపర్ అనిపించుకుంది. సూపర్ హీరోగా టోవినో అదరగొట్టాడని బాలీవుడ్ ప్రశంసలు కురిపించింది. కరమ్ జోహార్ లాంటి వాళ్లు టోవినోకు పర్సనల్ మెసేజ్ లు కూడా పెట్టారు. సో దేవరకొండను ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు టోవినోతో సినిమా చేసిన కరణ్ ఆశ్చర్యం లేదు.