UP Election : ఎస్పీకి 400 సీట్లు పక్కా..ఫేక్ బాబా కథ త్వరలో ముగుస్తుంది

వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 403 స్థానాలకు గాను... సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) 400 స్థాసాల్లో విజయం సాధిస్తుందని ఆ పార్టీ చీఫ్,మాజీ సీఎం

UP Election : ఎస్పీకి 400 సీట్లు పక్కా..ఫేక్ బాబా కథ త్వరలో ముగుస్తుంది

Up (8) (1)

UP Election వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 403 స్థానాలకు గాను… సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) 400 స్థాసాల్లో విజయం సాధిస్తుందని ఆ పార్టీ చీఫ్,మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్ ఆశాభావం వ్య‌క్తం చేశారు.

బీజేపీ ప్రభుత్వాన్ని కూల‌దోయ‌డ‌మే ఎస్పీ లక్ష్యమన్నారు. కాన్పూర్‌ దేహత్ జిల్లాలో అఖిలేష్ మీడియాతో మాట్లాడుతూ..యూపీలో యోగి ఆదిత్యానాధ్ సార‌ధ్యంలోని బీజేపీ స‌ర్కార్‌పై ప్ర‌జ‌ల్లో తీవ్ర అసంతృప్తి నెల‌కొంద‌ప్పారు. యూపీలో రైతు వ్యతిరేక ప్రభుత్వం, పేడదొంగ ప్రభుత్వం ఉందన్నారు.

యోగి ప్రభుత్వం ప్రజలను దారుణంగా మోసం చేస్తోందని.. ఈ ప్రభుత్వ హయాంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అవినీతి, నేరాలు దారుణంగా పెరిగిపోయాయనని,శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని అఖిలేష్ ఆరోపించారు.ఎరువుల ధరల పెంపు వెనక ప్రభుత్వం ఉందని అఖిలేష్ ఆరోపించారు.

లఖింపూర్ ఖేరి ఘటనపై నిప్పులు చెరిగిన అఖిలేశ్ యాదవ్.. బీజేపీ ప్రభుత్వాన్ని రైతు వ్యతిరేకిగా అభివర్ణించారు. త్వరలోనే ప్రభుత్వం మారుతుందని అన్నారు. బీజేపీ కార్యకర్తలు తమ వాహనాల కింద రైతులను నలిపివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  త్వరలోనే నకిలీ బాబా కథ ముగుస్తుందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ఉద్దేశించి అన్నారు. వచ్చే ఎన్నికల్లో చిన్న పార్టీలతో కలిసి పోటీ చేస్తామని, జాతీయ పార్టీలతో పొత్తుపెట్టుకోబోమని అఖిలేశ్ స్పష్టం చేశారు.

ALSO READ  Lakhimpur Violence : కేంద్రమంత్రి కుమారుడితో సీన్ రీకనస్ట్రక్షన్