UP Election : ఎస్పీ-ఎస్బీఎస్పీ మధ్య కుదిరిన పొత్తు

వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలో పార్టీల మధ్య పొత్తుల కోలాహలం మొదలైంది. తాజాగా ఓం ప్రకాష్ రాజ్‌భ‌ర్ నేతృత్వంలోని

UP Election : ఎస్పీ-ఎస్బీఎస్పీ మధ్య కుదిరిన పొత్తు

Sp Sbsp

UP Election వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలో పార్టీల మధ్య పొత్తుల కోలాహలం మొదలైంది. తాజాగా ఓం ప్రకాష్ రాజ్‌భ‌ర్ నేతృత్వంలోని సుహేల్‌దేవ్ బహుజన్ సమాజ్‌ పార్టీ(SBSP),అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ(SP)మధ్య పొత్తు ఖరారైంది. ఎస్పీబీఎస్పీ అధినేత ఓం ప్రకాష్ రాజ్‌భర్ బుధవారం ఎస్పీ అధినేత అఖిలేష్‌ యాదవ్ ని కలుసుకున్నారు. లక్నోలోని ఎస్పీ ప్రధాన కార్యాలయంలో ఈ రెండు పార్టీలకు మధ్య ఒప్పందం కుదిరింది.

రాబోయే యూపీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఎస్పీతో కలిసి పోటీకి దిగుతున్న SBSP జాతీయ అధ్యక్షుడు ఓపీ రాజ్‌భ‌ర్ అఖిలేష్ తో సమావేశం అనంతరం ప్రకటించారు. అక్టోబర్ 27న మౌలో నిర్వహించే మహాపంచాయత్‌కు అఖిలేష్‌ను ఆహ్వానించినట్లు అక్కడి నుంచే తమ ఉమ్మడి ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. ఇక,బీజేపీ పాల‌న‌లో వంచ‌న‌కు గురైన‌వారు, హింస‌ను అనుభ‌వించిన‌వారు, వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తులు, ద‌ళితులు, మ‌హిళ‌లు, రైతులు, యువ‌త‌, బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల‌తో క‌లిసి.. యోగీ ఆదిత్య‌నాథ్ స‌ర్కారును గ‌ద్దె దించ‌డ‌మే ల‌క్ష్యంగా తాము ఈ ఎన్నిక‌ల్లో పోరాడుతామ‌ని అఖిలేష్ యాద‌వ్ చెప్పారు.

రాజ్‌భ‌ర్ పార్టీకి యూపీ అసెంబ్లీలో నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. అయినప్పటికీ యూపీలోని పూర్వాంచల్ ప్రాంతంలోని 12కి పైగా జిల్లాల్లో SBSPకి మంచి పట్టు ఉంది. ఇంతకుముందు బీజేపీ భాగస్వామిగా SBSP కొనసాగింది. 2019లో వెనుకబడినవర్గాలకు ప్రభుత్వం ఏమీ చేయట్లేదని ఆరోపించినందుకుగాను యూపీ కేబినెట్ నుంచి ఓపీ రాజ్‌భ‌ర్ ను కేబినెట్ నుంచి తొలగించారు యోగి ఆదిత్యనాథ్. రాజ్‌భ‌ర్ కుమారుడు అర్వింద్ సహా SBSP కి చెందిన ఏడుగురు సభ్యులను వారిని నియమించిన కమిటీల నుంచి వెంటనే తొలగించారు.

ALSO READ India-China Standoff : 100 రాకెట్ లాంఛర్లను సరిహద్దుకి తరలించిన చైనా