Sree Vishnu : తీవ్ర అస్వస్థతో హాస్పిటల్‌లో జాయిన్ అయిన హీరో శ్రీ విష్ణు..

ఇటీవల షూటింగ్ సమయంలో శ్రీ విష్ణు తీవ్ర అస్వస్థతకు గురవ్వగా ఆసుపత్రిలో చేర్పించారు. డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నట్లు తెలిసింది. అలాగే రక్తంలో ప్లేట్‌లెట్స్‌ సంఖ్య దారుణంగా పడిపోవడంతో..........

Sree Vishnu : తీవ్ర అస్వస్థతో హాస్పిటల్‌లో జాయిన్ అయిన హీరో శ్రీ విష్ణు..

Sree Vishnu

Sree Vishnu :  టాలీవుడ్ లో కొత్త కొత్త కథలని ఎంచుకొని గెలుపోటములతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు హీరో శ్రీ విష్ణు. ఇన్నాళ్లు క్లాస్ హీరోగా సినిమాలు చేసుకుంటూ వస్తున్న శ్రీవిష్ణు గత కొన్ని రోజులుగా మెల్లిమెల్లిగా మాస్ వైపు ఫోకస్ చేస్తున్నాడు. ప్రస్తుతం పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అల్లూరి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే తాజాగా శ్రీ విష్ణు అనారోగ్యం పాలవ్వడంతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు.

Suriya : సూరరై పొట్రుకు ఐదు జాతీయ అవార్డులు.. హీరో సూర్య ఎమోషనల్ ట్వీట్..

ఇటీవల షూటింగ్ సమయంలో శ్రీ విష్ణు తీవ్ర అస్వస్థతకు గురవ్వగా ఆసుపత్రిలో చేర్పించారు. డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నట్లు తెలిసింది. అలాగే రక్తంలో ప్లేట్‌లెట్స్‌ సంఖ్య దారుణంగా పడిపోవడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. శ్రీ విష్ణు త్వరగా కోలుకోవాలని అభిమానులు, ప్రముఖులు కోరుకుంటూ పోస్టులు పెడుతున్నారు.