Bigg Boss 5 : నువ్వు నాకు సిస్టర్ ఏంటి? బ్రో అని పిలవకు.. కాజల్ పై శ్రీరామ్ ఫైర్

ఇక హౌస్ లో మొదటి నుంచి శ్రీరామచంద్రకు, కాజల్ కి పడదు. మొదట్నుంచి వీరిద్దరూ ప్రతి విషయంలోనూ గొడవ పడుతూనే ఉంటారు. తాజాగా నిన్న మరోసారి హౌస్‌లో శ్రీరామ్‌, కాజల్‌కు గొడవ.....

Bigg Boss 5 : నువ్వు నాకు సిస్టర్ ఏంటి? బ్రో అని పిలవకు.. కాజల్ పై శ్రీరామ్ ఫైర్

Sreeram Kajal

Bigg Boss :  బిగ్ బాస్ చివరి దశకు రావడంతో రోజు రోజుకి మరింత ఆసక్తిగా మారుతుంది. హౌస్ లో మిగిలిన కంటెస్టెంట్స్ అంతా పోటీ పడి మరీ ఆడుతున్నారు. సన్నీ, శ్రీరామ్, షన్ను ఇప్పటికే ఫైనల్ కి వెళ్లిపోయారు. ఇక మరో ఇద్దరు కంటెస్టెంట్స్ ఫైనల్ కి వెళ్ళాలి. ఆ రెండు స్థానాల కోసం మానస్, సిరి, కాజల్ పోటీ పడుతున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో సీన్స్ రీ క్రియేషన్స్ తో పాటు స్టార్లను అనుకరించే టాస్కులని ఇచ్చాడు బిగ్ బాస్.

Sonia Agarwal : తెలుగులో రీఎంట్రీ ఇస్తున్న ‘7/G బృందావన కాలనీ’ భామ

ఇక హౌస్ లో మొదటి నుంచి శ్రీరామచంద్రకు, కాజల్ కి పడదు. మొదట్నుంచి వీరిద్దరూ ప్రతి విషయంలోనూ గొడవ పడుతూనే ఉంటారు. తాజాగా నిన్న మరోసారి హౌస్‌లో శ్రీరామ్‌, కాజల్‌కు గొడవ జరిగింది. ఒకపక్క తిట్టుకుంటూనే కాజల్‌ శ్రీరామ్ ని బ్రో అని పిలిచింది. దీంతో శ్రీరామ్ సీరియస్ అయి నువ్వు నాకు సిస్టర్‌ కాదు, బ్రో అని పిలవకు అని గట్టిగా చెప్పాడు. దీంతో కాజల్ ఏడుపు అందుకుంది.

Ram Charan : మరదలితో కలిసి స్టెప్పులేసిన మెగా పవర్ స్టార్

ఆ తర్వాత కాజల్.. సన్నీ, మానస్ దగ్గరికి వచ్చి వారితో తన బాధని చెప్పుకుంది. నేను ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యాను అందుకే బ్రో అని పిలిచాను. కాని శ్రీరామ్ అలా పిలవద్దనేసరికి తట్టుకోలేకపోతున్నాను అంటూ తన బాధను సన్నీ, మానస్‌లకు చెప్పుకొని ఏడ్చింది. అటు నుంచి కనెక్షన్‌ లేనప్పుడు, నిన్ను లైట్‌ తీసుకుంటున్నప్పుడు వాళ్లపై నువ్వు ఎక్కువ అంచానాలు పెట్టుకోవద్దు అని సన్నీ చెప్పాడు.