Sri Rama Navami 2023 : శ్రీరామడికి ప్రీతికరమైన ‘పానకం,వడపప్పు’ ప్రసాదాల్లో ఆరోగ్య పరమార్థం..

 శ్రీరామనవమి రోజున పానకం, వడపప్పు ప్రత్యేకమైనవి. ఈ ప్రసాదాల వెనుక ఆరోగ్య రహస్యాలు కూడా ఉన్నాయి. వేసవిలో వడదెబ్బ తగలకుండా వడపప్పు ఎలా సంరక్షిస్తుందో..పానకం ఉండే ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకుందాం..

Sri Rama Navami 2023 : శ్రీరామడికి ప్రీతికరమైన ‘పానకం,వడపప్పు’ ప్రసాదాల్లో ఆరోగ్య పరమార్థం..

Sri Rama Navami 2023..Paanakam vadapappu

Sri Rama Navami 2023 : శ్రీరామనవమి రోజున పానకం, వడపప్పు ప్రత్యేకమైనవి. ఈ ప్రసాదాల వెనుక ఆరోగ్య రహస్యాలు కూడా ఉన్నాయి. భారతీయుల జరుపుకునే పండుగలకు చేసుకునే ప్రసాదాలు, పిండివంటలు ఆయా కాలాల్లో వచ్చే వ్యాధులు దరిచేరనివ్వనివే ఉంటాయి. అదే భారతీయ పండుగల గొప్పతనం.అటువంటిదే వేసవి ప్రారంభంలో వచ్చే ఉగాది పండుగకు తయారు చేసుకునే ‘ఉగాది పచ్చడి’ కూడా. అలాగే ఉగాది పండుగ తరువాత వచ్చే శ్రీరామ నవమి పండుగకు తయారు చేసుకుని రామయ్యకు నైవేద్యంగా పెట్టే ‘పానకం,వడపప్పు’ ప్రసాదాల్లో కూడా ఆరోగ్య రహస్యాలు దాగున్నాయి.

శ్రీరామ నవమి పండుగ ఎంత విశిష్టమైనదో రామయ్యకు నైవేద్యంగా పెట్టే ‘పానకం,వడపప్పు’ లు కూడా అంతే విశిష్టమైనవి. ఆరోగ్యాలను ఇచ్చే ఈ ప్రసాదాల్లో ఎటువంటి లాభాలున్నాయో తెలుసుకుందాం.. శ్రీరామనవమి వేసవి కాలం ప్రారంభంలో వస్తుంది కాబట్టి శ్రీరాముడిని పూజించిన తరువాత కొత్తకుండలో మిరియాలు, బెల్లంతో చేసిన పానకం, వడపప్పు నైవేద్యంగా పెట్టి పంచి పెడతారు. భగవంతుడికి నివేదించే ప్రసాదాలు అన్నీ సమయానుకూలంగా, ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించినవే కావటం విశేషం. ఆరోగ్యం అంటే తినరేమో గానీ దేవుడి ప్రసాదం అంటే మాత్రం కళ్లకు అద్దుకుని మరీ తింటారు. బహుశా అందుకేనేమో మన పూర్వీకులు ఇలా పండుగలను వేడుకగా నిర్వహించటం వాటిని ప్రసాదాలుగా భావించి కళ్లకు అద్దుకుని తినటం ఆలోచించి సంప్రదాయంగా రూపొందించారేమో.

Sri Ram Navami 2023 : ‘నవమి’ రోజే శ్రీరాముడి జీవితంలో ముఖ్య ఘట్టాలు

ఇకపోతే శ్రీరామ నవమి పండుగలో ముఖ్యమైన ప్రసాదం పానకం. ఈ పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు వసంత రుతువులో వచ్చే గొంతు సంబంధిత వ్యాధులకు ఉపశమనాన్ని కలిగిస్తాయి. అంతేకాదు చక్కటి ఔషధంలా పనిచేస్తాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. పానకం శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనదని పండితులు చెబుతున్నారు.

అలాగే పానకానికి తోడు వడపప్పు శరీరానికి చాలా ఉపయోగపడుతుంది. వడపప్పు అంటే పెసరపప్పుని నానబెడతారు. దాంట్లో వసంతకాలంలో కాసే మామిడికాయ తురుము కూడా కలుపుతారు. పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది, జీర్ణశక్తిని వృద్ధి పరుస్తుంది. శరీరం కాంతివంతంగా చేస్తుంది. పెసరపప్పు జ్ఞానానికి ప్రతీక కూడా. మండుతున్న ఎండలలో ‘వడదెబ్బ’ కొట్టకుండా కాపాడుతుంది. పానకం తయారీలో వేసే యాలకులు, మిరియాలు, బెల్లంతో పాటు శొంఠి,తులసి ఆకులు,పచ్చకర్పూరం కూడా వేస్తారు చాలామంది. ఇవన్నీ ఆరోగ్యాలను కలిగించేవే.

Sri Rama Navami 2023 : శ్రీరామ నవమి విశిష్టత .. రామయ్య జన్మించిన అభిజిత్ ముహూర్తం అంటే ఏంటో తెలుసా?

పానకం, వడపప్పులతో పాటు చలిమిడి కూడా ఆరోగ్యాలనిచ్చేదే. చలిమిడి తయారీలోఉపయోగించే బియ్యంపిండి,కొబ్బరి తురుము, బెల్లం,నెయ్యి,పాలు, యాలకులు ఇలా అన్నీ ఆరోగ్యప్రదాయనిలే..ఇలా శ్రీరామనవమి పండుగ ప్రసాదాలు ఆరోగ్య ప్రదాయినిలు అయిన ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.