Tamil Nadu : శివకాశి మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా – సీఎం స్టాలిన్

శివకాశి బ్లాస్ట్‌లో మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంది. మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

Tamil Nadu : శివకాశి మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా – సీఎం స్టాలిన్

Tamil Nadu

Tamil Nadu : తమిళనాడు రాష్ట్రం విరుధునగర్ జిల్లాలోని శివకాశిలో ఓ బాణాసంచా కర్మాగారంలో పేలుడు జరిగిన విషయం తెలిసిందే. ఈ పేలుడులో 4గురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఇక ఈ ప్రమాదంపై తమిళనాడు సీఎం స్టాలిన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున రూ.3 లక్షల ఎక్స్-గ్రేషియా అందిస్తామని తెలిపారు.

చదవండి : Sivakasi : న్యూ ఇయర్ వేళ విషాదం.. శివకాశిలో పేలుడు.. నలుగురు మృతి

గాయపడిన వారికి లక్ష రూపాయల ఎక్స్-గ్రేషియా ఇవ్వనున్నట్లు వెల్లడించారు సీఎం. ఇటువంటి ప్రమాదాలు తరచుగా జరుగుతుండటం, ప్రజలు ప్రాణాలు కోల్పోతుండటం బాధాకరమని తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. ఫ్యాక్టరీలను, బాంబులు తయారు చేసే ప్రాంతాలలో సరైన రక్షణ చర్యలు ఉన్నాయో లేదో పరిశీలించాలని తెలిపారు.

చదవండి : Sivakasi : బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు..ఇద్దరు మృతి

కాగా ఈ ప్రమాదంలో ఎనిమిది మంది గాయపడగా ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా శివకాశి పరిసర ప్రాంతాల్లో బాంబుల తయారీ ఫ్యాక్టరీలు అధికంగా ఉంటాయి. దీనిని భారత ఫైర్ క్రాకర్స్ రాజధానిగా పిలుస్తుంటారు. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇదే ప్రాంతంలో పేలుడు జరగ్గా 21 మంది మృతి చెందారు. ఆ తర్వాత క్రాకర్స్ ఫ్యాక్టరీలపై దృష్టిపెట్టిన అధికారులు విరుధునగర్ జిల్లాలో తనిఖీలు చేసి నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న 60 ఫ్యాక్టరీలను మూసివేశారు. అయినా తరచుగా ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.