Tollywood Heros : షూటింగ్‌లతో బిజీగా మారిన స్టార్ హీరోలు.. ఎవరెవరు ఎక్కడ షూటింగ్ చేస్తున్నారో తెలుసా?

టాలీవుడ్ హీరోలు అంతా మళ్ళీ షూటింగ్ లతో బిజీ అయ్యారు. సంక్రాంతి పండగ కారణంగా బ్రేక్ తీసుకున్న సినిమాలు కొన్ని అయితే, ఇప్పుడే షూటింగ్ మొదలు పెడుతున్న సినిమాలు మరికొన్ని.

Tollywood Heros : షూటింగ్‌లతో బిజీగా మారిన స్టార్ హీరోలు.. ఎవరెవరు ఎక్కడ షూటింగ్ చేస్తున్నారో తెలుసా?

Tollywood Heros

Tollywood Heros : టాలీవుడ్ హీరోలు అంతా మళ్ళీ షూటింగ్ లతో బిజీ అయ్యారు. సంక్రాంతి పండగ కారణంగా బ్రేక్ తీసుకున్న సినిమాలు కొన్ని అయితే, ఇప్పుడే షూటింగ్ మొదలు పెడుతున్న సినిమాలు మరికొన్ని. గత కొత్త కాలంగా రెండేళ్ళకి ఒక సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న ప్రభాస్ వేగం పెంచేశాడు. ఈ ఏడాది రెండు చిత్రాలను రిలీజ్ కి సిద్ధం చేస్తున్నాడు. ఈ ఏడాది మధ్యలో ఆదిపురుష్ రిలీజ్ కానుండగా, ఎండింగ్ లో సలార్ విడుదల కానుంది. ప్రస్తుతం సలార్ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు.

Michael Trailer : సందీప్ కిషన్ ‘మైఖేల్’ ట్రైలర్‌ని లాంచ్ చేసిన బాలయ్య.. మాములుగా లేదు!

ఇక గత కొంత కాలంగా చిత్రీకరణ దశలోనే ఉన్న ‘హరిహర విరమల్లు’ షూటింగ్ ని పూర్తి చేసి ఈ ఏడాది ఎలాగైనా రిలీజ్ చేయడానికి పవన్ కళ్యాణ్ గ్యాప్ లేకుండా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ పిరియాడికల్ చిత్రం షూటింగ్ అన్నపూర్ణ 7ఏకర్స్ లో జరుగుతోంది. టాలీవుడ్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా. చాలా రోజుల గ్యాప్ తరువాత ఇటీవలే ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేశారు మేకర్స్. SSMB28 వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ సారధి స్టూడియోలో జరుగుతుంది.

అలాగే పాన్ ఇండియా వైడ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుష్ప-2 షూటింగ్ ఎట్టకేలకు మొదలు అయ్యింది. అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ షూటింగ్ వైజాగ్ లో జరుగుతుంది. వీటితో పాటు రవితేజ రావణాసుర సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో, నాగ చైతన్య కస్టడీ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో, శ్రీవాస్-గోపిచంద్ కలయికలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ రామబాణం షూటింగ్ మాదాపూర్ లో జరుగుతుంది. ఈ సినిమాలు అన్ని ఈ ఏడాది లోనే విడుదల కానున్నాయి.