IT Minister KTR : కేటీఆర్‌ను అడ్డుకున్న విద్యార్ధులు

ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఈరోజు నారాయణ పేట జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృధ్ది కార్యక్రమాలకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు.

IT Minister KTR : కేటీఆర్‌ను అడ్డుకున్న విద్యార్ధులు

IT Minister KTR : ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఈరోజు నారాయణ పేట జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృధ్ది కార్యక్రమాలకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో నారాయణపేట చేరుకున్న ఆయన రోడ్డు మార్గం గుండా జిల్లా ఆస్పత్రిలో నిర్మించిన చిన్న పిల్లల వార్డు ప్రారంభోత్సవానికి బయలు దేరారు.

కాగా…. కేటీఆర్ కాన్వాయ్ ను అడ్డుకునేందుకు ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్ధులు ప్రయత్నించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు.

అనంతరం జిల్లా ఆస్పత్రిలో సకల సదుపాయాలతో సిద్ధం చేసిన చిన్నపిల్లల వార్డును కేటీఆర్‌ ప్రారంభించారు. పట్టణంలోని బస్ డిపో ఎదురుగా రూ.6 కోట్లతో చేపడుతున్న వెజ్‌ అండ్‌ నాన్‌వెజ్‌ మార్కెట్‌కు శంకుస్థాపన చేశారు. జిల్లా కేంద్రంలో రూ.20 లక్షలతో నిర్మించనున్న అమరవీరుల స్తూపం పనులను ప్రారంభించారు. అనంతరం సింగారం క్రాస్‌ రోడ్డులో చేనేత శిక్షణ, ఉత్పత్తి కేంద్రం.. అంబేడ్కర్ చౌరస్తా పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. ఆ తర్వాత పిల్లల పార్కు, సైన్స్‌ పార్కులను ప్రారంభించారు.