Rajinikanth: నడిస్తే స్టైల్.. మాట్లాడితే కేక.. అసలేంటీ రజనీ మేనియా!

ఆయన స్టైలే వేరు.. ఆయన రూటే సేపరేటు.. ఆయన పేరంటేనే ఓ బ్రాండ్. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌ లేదు.. ఒక్కరోజులో సూపర్‌ స్టార్అయిపోలేదు. చూసేందుకు సింపుల్‌గా కనిపించినా ఎన్నో రికార్డులను..

Rajinikanth: నడిస్తే స్టైల్.. మాట్లాడితే కేక.. అసలేంటీ రజనీ మేనియా!

Rajinikanth1

Rajinikanth: ఆయన స్టైలే వేరు.. ఆయన రూటే సేపరేటు.. ఆయన పేరంటేనే ఓ బ్రాండ్. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌ లేదు.. ఒక్కరోజులో సూపర్‌ స్టార్అయిపోలేదు. చూసేందుకు సింపుల్‌గా కనిపించినా ఎన్నో రికార్డులను తిరగరాసాడు. సూపర్‌స్టార్‌ పేరు చెబితే చాలు… అభిమానుల్లో పునకాలు మొదలవుతాయి. రాజబాటలో నడిచే అదృష్టం ఉన్నా… రహదారిలోనే వెళ్లాలనుకునే సాదాసీదా మనిషి. శివాజీగా జన్మించి… రజనీకాంత్‌గా ఎదిగి… తలైవా అనిపించుకున్నారు రజనీకాంత్. నాలుగు దశాబ్ధాలకు పైగా సినీరంగంలో యాక్టింగ్‌తో ప్రేక్షకులను అలరించిన రజనీకాంత్‌కు… భారతదేశ సినిమా అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు వరించింది.

Annaatthe : ఫెస్టివల్‌కి సూపర్‌స్టార్ డబుల్ ట్రీట్..

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌.. పేరు వింటే చాలు సౌత్ సినిమా ఫ్యాన్స్‌లో ఎక్కడా లేని కిక్కొస్తుంది. తలైవా అంటే పంచ్‌డైలాగ్‌ కింగ్.. స్టెప్పులేస్తే థియేటర్ దద్దరిల్లిపోవాల్సిందే. ఆయన నడిచినా స్టైలే… మాట్లాడితే కేకే… స్టైల్‌గా సెల్యూట్ కొడితే ఫ్యాన్స్ గులాములైపోల్సిందే. సిగరెట్ నోట్లో వేసుకునే స్టైల్‌కు అభిమానులు ఫిదా అవ్వాల్సిందే.. రజనీ యాక్టింగ్‌లో ఉండే ఈజ్‌కు ఆడియన్స్ ఫ్రీజ్ అయిపోతారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి సింగిల్‌గా వచ్చిన రజనీకాంత్… తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేశారు. ట్రెండ్ ఫాలో అవ్వనంటూనే ఇండస్ట్రీలో నయా ట్రెండ్ క్రియేట్ చేశాడు తలైవా.

Rajinikanth : ఈ రోజు నా జీవితంలో ఎంతో స్పెషల్.. ఆనందంలో సూపర్ స్టార్

భారతీయ సినిమా పరిశ్రమకు సేవలందించిన మహనీయులను దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారంతో గౌరవిస్తారు. భారతీయ చలన చిత్ర పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే పేరుతో సినీ రంగంలో విశేష సేవలు అందించిన వారికి 1969 నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారం ప్రకటిస్తోంది. ఈసారి తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ను దాదాసాహేబ్‌ ఫాల్కే అవార్డు వరించింది. ఢిల్లీలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా దాదాసాహేబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు తలైవా.

Rajinikanth: జపాన్‌లో రజినీ హవా.. ఇక్కడ యావరేజ్ సినిమా.. అక్కడ సూపర్ హిట్!

దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా సినీరంగంలో నటనతో ప్రేక్షకులను అలరించిన సూపర్‌స్టార్‌… కేవలం హీరోగానే కాకుండా.. దర్శకుడిగా, నిర్మాతగా సినీ పరిశ్రమలో నిజంగానే సూపర్‌స్టార్‌ అనిపించుకున్నారు. రజనీకాంత్‌ కంటే ముందు 50 మంది నటులు, డైరెక్టర్లు, నిర్మాతలు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును సొంతం చేసుకున్నారు. దక్షిణాదికి చెందిన బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి, ఎల్వీ ప్రసాద్‌, నాగిరెడ్డి, అక్కినేని నాగేశ్వరరావు, శివాజీ గణేషన్‌, రాజ్‌కుమార్‌, గోపాలకృష్ణన్‌, రామానాయుడు, బాలచందర్‌, కె.విశ్వనాథ్‌ ఈ పురస్కారాన్ని అందుకున్న వారిలో ఉన్నారు. ఈ లిస్ట్‌లో రజనీకాంత్‌ కూడా చేరారు.

Rajinikanth : రజినీ కాంత్‌తో రాజమౌళి..!

ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును స్వీకరించిన రజనీకాంత్ ఆనందం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఫాల్కే అవార్డును తన మెంటార్, దర్శకుడు కె.బాల చందర్‌కు అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు. తనలో నటనను గుర్తించి ప్రోత్సహించిన స్నేహితుడు, సోదరుడుతో పాటు సినీ ప్రయాణంలో సహకరించిన అందరికి, ఎంతగానో ఆదరించిన తమిళ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు రజనీకాంత్.