Himachal Government Formation: హిమాచల్‌ ప్రదేశ్ సీఎంగా సుఖ్విందర్ సింగ్ సుఖు ప్రమాణ స్వీకారం.. పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు

హిమాచల్ ప్రదేశ్ సీఎంగా సుఖ్విందర్ సింగ్ సుఖు, ఉప ముఖ్యమంత్రిగా ముఖేష్ అగ్ని‌హోత్రి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Himachal Government Formation: హిమాచల్‌ ప్రదేశ్ సీఎంగా సుఖ్విందర్ సింగ్ సుఖు ప్రమాణ స్వీకారం.. పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు

Himachal Pradesh Cm

Himachal Government Formation: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర 15వ ముఖ్యమంత్రిగా సుఖ్విందర్ సింగ్ సుఖు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా ముఖేష్ అగ్నిహోత్రి ప్రమాణ స్వీకారం చేశారు. మధ్యాహ్నం 1.30 గంటలకు సిమ్లాలోని రిడ్జ్ మైదానంలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. వీరితో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రమాణం చేయించారు.

Himachal Pradesh CM: ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు తల్లి పాదాలకు నమస్కారం చేసిన సుఖ్విందర్ సింగ్ సఖు

ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో పాటు కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలు, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ హుడా, హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ఇన్ ఛార్జి రాజీవ్ శుక్లా పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు ఇంటి నుంచి బయలుదేరే క్రమంలో సుఖ్విందర్ అతని తల్లి పాదాలకు నమస్కారం చేశారు.

హిమాచల్ ప్రదేశ్ సీఎంగా సుఖ్విందర్ సింగ్ సుఖు పేరును కాంగ్రెస్ హైకమాండ్ ఆమోదించిన తరువాత శనివారం సాయంత్రం సిమ్లాలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కూడా సుఖ్విందర్ సింగ్ సుఖు లెజిస్లేచర్ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సుఖ్విందర్ సింగ్ 1989 నుంచి 1995 మధ్య కాలంలో ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా, 2003 నుండి నాదౌన్ నుండి ఎమ్మెల్యేగా ఉన్నారు. సీఎం సుఖ్‌విందర్ తండ్రి హిమాచల్ ట్రాన్స్‌పోర్ట్‌లో బస్సు డ్రైవర్‌గా పనిచేశారు. సుఖ్విందర్సిం గ్ స్వయంగా సిమ్లాలో మిల్క్ కౌంటర్ నడుపుతున్నారు.