Chicken Price: వేసవి ఎఫెక్ట్.. మాంసాహార ప్రియులకు షాక్..

మాంసాహార ప్రియులకు ఇది షాకింగ్ న్యూసే. చికెన్, మటన్ ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా చికెన్ రేట్లు భారీగా పెరుగుతుండటంతో వారంలో రెండు సార్లు చికెన్ తినేవారుసైతం...

Chicken Price: వేసవి ఎఫెక్ట్.. మాంసాహార ప్రియులకు షాక్..

Chiken Price

Chicken Price: మాంసాహార ప్రియులకు ఇది షాకింగ్ న్యూసే. చికెన్, మటన్ ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా చికెన్ రేట్లు భారీగా పెరుగుతుండటంతో వారంలో రెండు సార్లు చికెన్ తినేవారుసైతం పప్పన్నంతో సరిపెట్టుకుంటున్న పరిస్థితి. వేసవి ఎండలు విపరీతంగా ఉండటం, వేడి గాలులు వీస్తుండటంతో ఫారాల్లో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఫలితంగా కిలో చికెన్ ధర రూ. 300కు చేరింది. గడిచిన వారం రోజుల్లోనే కిలో చికెన్ ధర రూ. 50 నుంచి 60 వరకు పెరిగింది. ఉత్పత్తి తగ్గడం, డిమాండ్ పెరగడమే చికెన్ ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు పేర్కొంటున్నారు.

ఇమ్యూనిటీ పెంచే ‘ఆయుర్వేదిక్ చికెన్ ధమ్ బిర్యానీ’..రండి బాబూ రండీ..

మరోవైపు వేసవిలో శుభకార్యాలు, దేవుళ్లకు మొక్కలు, ఇతర కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతుంటాయి. దీంతో చికెన్ వినియోగం కూడా వేసవిలో ఎక్కువగా ఉండటం సర్వసాధారణం. అయితే వేసవి ఉష్ణోగ్రతలు 40డిగ్రీలు దాటి నమోదవుతుండటంతో పాటు వడగాల్పులు వీస్తుంటంతో కోళ్లు చనిపోతున్నాయని, ఫలితంగా ఉన్న కోళ్లకు రేట్లు పెంచి విక్రయాలు చేయాల్సి వస్తుందని వ్యాపారులు పేర్కొంటున్నారు. మరోవైపు డిమాండ్ ఉండటంతో కొంతమంది కోళ్లఫాం వ్యాపారులు కోడి బరువు తక్కువగా ఉండగానే అమ్మకాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

Mohali: పోలీస్ ఇంటెలిజెన్స్ కార్యాలయంపై రాకెట్ దాడి ఘటనలో దర్యాప్తు వేగవంతం.. రంగంలోకి ఎన్ఐఏ

మరోవైపు మటన్ ధరలు పెరిగాయి. గత పదిరోజుల క్రితం కిలో మటన్ రూ. 750 వరకు ఉండేది. ప్రస్తుతం కిలో మటన్ ధర రూ. 800 నుంచి రూ. 850 వరకు పలుకుతుంది. దగ్గరదగ్గర మటన్ కిలో వెయ్యి ఉండటంతో ప్రజలు మటన్ కొనుగోలుకు పెద్దగా ఆసక్తిచూపరు, ఎక్కువగా చికెన్ వైపే మొగ్గుచూపుతారు. ఈ క్రమంలో చికెన్ ధరలుసైతం పెరగడంతో మాంసాహార ప్రియులు పప్పు, ఆకు కూరలతో సరిపెట్టుకుంటున్న పరిస్థితి ఏర్పడింది. ఎండల తీవ్రత మరో నెలరోజుల పాటు ఇలానే కొనసాగే అవకాశం ఉండటంతో చికెన్ ధరలు మరింత పెరిగే అవకాశాలున్నట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు.