Rajinikanth : సూపర్‌స్టార్ సిక్ అయ్యారు.. అమెరికా ఆసుపత్రిలో రజినీకాంత్..

70 ఏళ్లొచ్చినా ఇంకా ఎనర్జిటిక్‌గా, యాక్టివ్‌గా ఉండే రజినీకాంత్ ఇప్పుడు కాస్త స్లో అయ్యారు..

Rajinikanth : సూపర్‌స్టార్ సిక్ అయ్యారు.. అమెరికా ఆసుపత్రిలో రజినీకాంత్..

Rajinikanth

Rajinikanth: 70 ఏళ్లొచ్చినా ఇంకా ఎనర్జిటిక్‌గా, యాక్టివ్‌గా ఉండే రజినీకాంత్ ఇప్పుడు కాస్త స్లో అయ్యారు. హెల్త్ ఇష్యూస్‌తోనే పాలిటిక్స్ నుంచి మిడిల్ డ్రాప్ అయిన రజినీకాంత్.. ఇప్పుడు సడెన్‌గా షూటింగ్ ఆపేసి మరీ చెకప్ కోసం ఫారెన్ బయల్దేరారు. రజినీ అంత హడావిడిగా స్పెషల్ పర్మిషన్ తీసుకుని మరీ ఫారెన్ వెళ్తున్నారంటే.. ఏదో ఉందని వర్రీ అవుతున్నారు ఫ్యాన్స్. ఇంతకీ విషయం ఏంటి..?

లాక్‌డౌన్ తర్వాత సీనియర్ స్టార్ రజినీకాంత్ షూటింగ్ మొదలుపెట్టారు. భారీ స్టార్ కాస్ట్‌తో ‘అన్నాత్తే’ షూటింగ్ స్టార్ట్ చేసిన రజినీకాంత్.. ఈ షూట్‌ని మధ్యలోనే ఆపేశారు. యూనిట్‌లో ఏదైనా ఇబ్బందా, లేక ఎవరికైనా పాజిటివ్ వచ్చిందా అంటే అది కూడా కాదు.. రజినీకాంత్‌కే ఆరోగ్యం బాలేక షెడ్యూల్ క్యాన్సిల్ చెయ్యాల్సి వచ్చింది.

Rajinikanth : హెల్త్ చెకప్ కోసం రజినీకాంత్ అమెరికా పయనం..

సౌత్ సూపర్‌స్టార్ రజినీకాంత్ ఈ మధ్య కాస్త స్లో అయ్యారు. 70 ఇయర్స్ సూపర్ స్టార్ సిక్ అయ్యారు. అందుకే చెకప్ కోసం స్పెషల్ పర్మిషన్ తీసుకుని మరీ అమెరికా వెళ్లారు. 10 ఏళ్ల క్రితం
చేయించుకున్న సర్జరీ ఫాలోఅప్ చెకప్ కోసం అర్జెంట్‌గా అమెరికా వెళ్లాల్సొచ్చింది రజినీకాంత్. స్పెషల్ ఫ్లైట్‌లో తన ఫ్యామిలీతో కలిసి అమెరికా వెళ్లారు రజినీకాంత్.

రజినీకాంత్ 70 ఏళ్ల ఎనర్జీ కాస్త స్లో అయ్యింది. 2011 లో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్న రజినీకాంత్ ఈ మధ్య కాస్త సిక్ అవ్వడంతో మళ్లీ ఒకసారి ఫుల్ చెకప్ కోసం అమెరికా వెళ్లిన రజినీకాంత్.. అక్కడే 3 నెలలుంటారని, రెస్ట్ తీసుకున్నాకే రిటర్న్ వస్తారని కోలీవుడ్‌లో టాక్ నడుస్తోంది.