Suriya-Jyothika : 16 ఏళ్ళ తర్వాత మళ్ళీ కలిసి నటించనున్న భార్య భర్తలు

తమిళ స్టార్ కపుల్ సూర్య, జ్యోతిక గతంలో దాదాపు 6 సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. ఒక సినిమాలో సూర్య గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు. సూర్య, జ్యోతిక కలిసి చివరి సారిగా 2006లో........

Suriya-Jyothika : 16 ఏళ్ళ తర్వాత మళ్ళీ కలిసి నటించనున్న భార్య భర్తలు

Suriya

 

Suriya-Jyothika :  తమిళ స్టార్ కపుల్ సూర్య, జ్యోతిక గతంలో దాదాపు 6 సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. ఒక సినిమాలో సూర్య గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు. సూర్య, జ్యోతిక కలిసి చివరి సారిగా 2006లో ‘సిల్లును ఒరు కాదల్’ సినిమాలో నటించారు. ఈ సినిమా తెలుగులో ‘నువ్వు నేను ప్రేమ’గా డబ్ అయింది. తాజాగా ఈ జంట 16 ఏళ్ళ తర్వాత మరోసారి కలిసి నటించనున్నారు. ఈ మేరకు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

 

తమిళ్ లో వైవిధ్యమైన కాన్సెప్టులతో సినిమాలు తీసే డైరెక్టర్ బాల. డిఫరెంట్ కాన్సెప్టులతో గతంలో చాలా సినిమాలు తీసి విజయం సాధించాడు. బాల డైరెక్షన్ లో సూర్య ఇప్పటికే రెండు సినిమాలు చేశారు. తమిళ్ లో సూర్య నంద, పితాగామన్ సినిమాలు బాల దర్శకత్వంలో చేశారు. ఈ సినిమాలు తెలుగులో ఆక్రోశం, శివ పుత్రుడు సినిమాలుగా రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాలు కూడా భారీ విజయం సాధించాయి. తాజాగా ఇటీవలే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఉండబోతుందని ప్రకటించారు.

Vivek Agnihotri : ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రికి ‘వై’ కేటగిరి భద్రత

బాల డైరెక్షన్ లో సూర్య మూడో సినిమా త్వరలో మొదలు పెట్టనున్నారు. ఇందులో సూర్య ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో జ్యోతికని హీరోయిన్ గా తీసుకోబోతున్నారు. అంటే 16 ఏళ్ల తర్వాత జ్యోతిక భర్త సూర్యతో కలిసి నంటించనుంది. అలాగే ఈ సినిమాలో మరో హీరోయిన్ గా కృతి శెట్టిని కూడా అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాతో బాల, సూర్య కలిసి హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చూస్తున్నారు. ఇక జ్యోతిక, సూర్య కలిసి నటిస్తుండటంతో ఈ స్టార్ కపుల్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.