Sweety weds Sheru: స్వీటీ పెళ్లి షేరూతో.. సంప్రదాయబద్ధంగా పెంపుడు కుక్కల పెళ్లి

పెంపుడు కుక్కల పెళ్లిని పూర్తి సంప్రదాయబద్ధంగా జరిపించాయి ఇరు కుటుంబాలు. గుర్గావ్‌కు చెందిన ఆడ, మగ కుక్కల కుటుంబాలు ఈ పెళ్లి తంతును వంద మంది అతిథుల మధ్య ఘనంగా నిర్వహించాయి.

Sweety weds Sheru: స్వీటీ పెళ్లి షేరూతో.. సంప్రదాయబద్ధంగా పెంపుడు కుక్కల పెళ్లి

Sweety weds Sheru: కుక్కలు, పిల్లులుసహా పెంపుడు జంతువులు అంటే చాలా మందికి విపరీతమైన ప్రేమ. వాటిని కొందరు ఇంట్లో మనుషులతో సమానంగా చూస్తారు. వాటి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు.

Andhraradesh : 40 కిలోల కారంతో అభిషేకం చేయించుకున్న స్వామీజీ

తాజాగా రెండు కుటుంబాలు తమ పెంపుడు కుక్కల పెళ్లిని ఘనంగా చేసింది. అయితే, ఈ పెళ్లిని సాదాసీదాగా చేయలేదు. పూర్తిగా హిందూ సంప్రదాయం ప్రకారం.. భాజాబజంత్రీలతో పెళ్లి వేడుక ఘనంగా నిర్వహించారు. గుర్గావ్‌లోని, జైల్ సింగ్ కాలనీలో ఉన్న పాలం విహార్ ఎక్స్‌టెన్షన్‌లో ఉంటున్న కుటుంబాల మధ్య ఈ పెళ్లి వేడుక నిర్వహించింది. షేరూ అనే మగ కుక్కకు, స్వీటీ అనే ఆడ కుక్కకు ఈ పెళ్లి జరిపించారు. పెళ్లి కోసం 25 వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ చేయించారు. వంద మందికిపైగా అతిథుల్ని ఆహ్వానించారు.

Fighter Planes Collide: ఎయిర్ షో సమయంలో ఢీకొన్న రెండు యుద్ధ విమానాలు.. ఆరుగురు మృతి.. వీడియో వైరల్

హల్దీ కార్యక్రమంతోపాటు ఇతర వేడుకలు నిర్వహించి పెళ్లి జరిపించారు. పెళ్లి అనంతరం విందు ఏర్పాటు చేశారు. డోలు, బారాత్ వంటివి నిర్వహించారు. మనుషుల పెళ్లి ఎంత సంప్రదాయబద్ధంగా జరుగుతుందో కుక్కల పెళ్లిని కూడా అలాగే నిర్వహించారు. ప్రస్తుతం ఈ పెళ్లి తంతు సంచలనంగా మారింది.