T20 World Cup 2021: కోహ్లీ.. వన్డే, టెస్టు జట్ల కెప్టెన్సీ వదలకూడదు – వీరేంద్ర సెహ్వాగ్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కొద్ది వారాల ముందే టీ20 ఫార్మాట్ కు వీడ్కోలు చెప్పేశాడు. దీనికి సంబంధించి సోమవారం నమీబియాతో జరిగిన ఆఖరి మ్యాచ్...

T20 World Cup 2021: కోహ్లీ.. వన్డే, టెస్టు జట్ల కెప్టెన్సీ వదలకూడదు – వీరేంద్ర సెహ్వాగ్

New Project

T20 World Cup 2021: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కొద్ది వారాల ముందే టీ20 ఫార్మాట్ కు వీడ్కోలు చెప్పేశాడు. దీనికి సంబంధించి సోమవారం నమీబియాతో జరిగిన ఆఖరి మ్యాచ్ ను పూర్తి చేసేసుకున్నాడు. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2021ను నమీబియాపై 9వికెట్ల తేడాతో ముగించేలా చేశాడు.

మరి కొద్ది రోజుల్లో బీసీసీఐ అధికారులు మీట్ అయి తర్వాతి వన్డే కెప్టెన్ గురించి కూడా చర్చలు జరపనున్నారు. కోహ్లీ వన్డే ఫార్మాట్ కెప్టెన్సీ కూడా వదిలేస్తాడా అనే అనుమానాలు లేకపోలేదు. దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇలా అంటున్నారు.

‘ఇది విరాట్ సొంత నిర్ణయం. కానీ, మిగిలిన రెండు ఫార్మాట్లకు కెప్టెన్సీ వదలకూడదనే అనుకుంటున్నా. అతను ఒక ప్లేయర్ గా మాత్రమే ఆడాలనుకుంటే అది అతని ఇష్టం. అతని కెప్టెన్సీలో ఇండియా బాగా ఆడింది. కెప్టెన్ గా బ్రిలియంట్ రికార్డు నెలకొల్పాడు’ అని సెహ్వాగ్ ఫేస్‌బుక్ అఫీషియల్ పేజ్ ద్వారా వెల్లడించాడు.

…………………………………..: స్వీటీ మనసు స్వీట్.. అందంలో అప్సరస!

అతనొక మంచి ప్లేయర్. ముందుండి నడిపించే అగ్రెసివ్ కెప్టెన్ కూడా. అందుకే వన్డేలకు, టెస్టులకు కెప్టెన్సీ వదలకూడదని అనుకుంటున్నా. ఇకపై తన వ్యక్తిగత నిర్ణయం. అని అభిప్రాయపడ్డాడు.

కష్టకాలంలో టీమిండియాకు సపోర్ట్ చేయాలి. చాలా కాలం నుంచి మనం ఏ ఐసీసీ మేజర్ టోర్నమెంట్ ను మనం గెలవలేదు. ఇండియా తప్పకుండా దీనిపై యాక్షన్ తీసుకోవాలి. దైపాక్షిక సిరీస్ గెలవడం ఒక విషయం అయితే ప్రజలు వరల్డ్ టోర్నమెంట్స్ మాత్రమే గుర్తుంచుకుంటారు’ అని సెహ్వాగ్ అన్నాడు.

టీమిండియా తన తర్వాతి మ్యాచ్‌ను న్యూజిలాండ్ తో నవంబర్ 17 నుంచి మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా ఆడనుంది.